Helicopter (హెలికాప్టరు) లాగా విమానం నిట్టనిలువుగా ఎందుకు లేవదు?

by S Gopi |   ( Updated:2022-11-25 03:49:35.0  )
Helicopter (హెలికాప్టరు) లాగా విమానం నిట్టనిలువుగా ఎందుకు లేవదు?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ విషయంలో చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే, హెలికాప్టరైనా, విమానమైనా గాల్లోకి లేవాలంటే గాలిని తనకు అనువుగా మార్చుకోవాలి. అంటే పై వైపు తక్కువ గాలి ఉండి అల్పపీడనం తయారయ్యేలా ఉండాలి. ఫలితంగా చుట్టుప్రక్కల, కిందివైపు అధికపీడనంతో ఉన్న గాలి అల్పపీడనాన్ని నింపే ప్రయత్నంలో విమానాన్ని, హెలికాప్టర్ ను గాల్లోకి లేచేలా చేస్తుంది.

అయితే, హెలికాప్టర్ బరువు విమానంతో పోలిస్తే చాలా తక్కువ. అంతేకాదు దానిపైన తిరిగే బ్లేడ్స్ సూటిగా, వేగంగా గాలిని కిందికి నెట్టి పై భాగంలో అల్పపీడనం, కింది సైడ్ అధిక పీడనం ఉండేలా చేస్తాయి. దీంతో ఏర్పడిన అధిక పీడనం హెలికాప్టర్ ను సులువుగా గాల్లోకి నెట్టేంత బలం కలిగి ఉంటుంది. అయితే, ఇలాంటి స్థితి అధిక బరువుండే విమానం విషయంలో ఏర్పడదు. విమానం రన్ వే పై పరిగెత్తేటప్పుడు కిందివైపు అధికపీడనం క్రమేపీ పెరిగి విమానం గాల్లో లేచేలా చేస్తుంది. అందుకే హెలికాప్టర్ లాగా విమానం నిట్టనిలువుగా లేవదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed