Flight Journey : విమానంలో లైట్ల వెలుతురు.. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఎందుకు డిమ్ చేస్తారంటే..

by Javid Pasha |
Flight Journey : విమానంలో లైట్ల వెలుతురు.. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఎందుకు డిమ్ చేస్తారంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో వివిధ దేశాలు, నగరాల మధ్య విమాన ప్రయాణాలు సర్వసాధారణమై పోయాయి. ఇక ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేసేవారికైతే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. అలాగే ఈ ప్రయాణానికి సంబంధించిన పలు నిబంధనలు, భద్రతా పరమైన అంశాలు ప్రయాణికులు, విమానయాన సిబ్బంది పాటించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో సీట్ బెల్టు పెట్టుకోవడం, అలాగే ఫ్లైట్ సిబ్బంది టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో విమానంలోని లైట్లు డిమ్ చేయడం తప్పక చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా లైట్లను ఎందుకని డిమ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు వాటిలోపల లైట్స్ డిమ్ చేస్తే ఆ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉందని అర్థం. అలాగే నిబంధనల్లో భాగంగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కూడా ఇలా చేస్తారని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ సంభవిస్తే ప్యాసింజర్స్‌ను త్వరగా తరలించడానికి డిమ్ లైట్స్ అనుకూలంగా ఉంటాయట. అదే లైట్లు పూర్తిగా ఆఫ్ చేసి ఉంటే.. ఆ చీటకి కారణంగా అత్యవసర పరిస్థితిలో తేరుకోవడానికి సమయం పడుతుంది. అప్పటికప్పుడు లైట్లు వేసినా సర్దుబాటు అయ్యేందుకు కనీసం 15 నిమిషాలైనా పడుతుంది. అందుకే డిమ్ లైట్లు వేసి ఉంచితే.. అలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తారు. దీంతోపాటు డిమ్ లైట్ల వెలుతురులో బయటకు వెళ్లే మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయట. కాబట్టి ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో కన్‌ఫ్యూజ్‌కు అవకాశం ఉండదు. అలాగే ఫ్లైట్ అటెండెన్స్ విమానం బయటి పరిస్థితులను పర్యవేక్షించడానికి, అవగాహనకు రావడానికి డిమ్ లైట్స్ వెలుతురు ఉపయోగపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed