టెలిఫోన్ రిసీవర్ వైర్లు రౌండ్ షేపులోనే ఎందుకు ఉంటాయి?.. ఇదీ అసలు కారణం!

by Javid Pasha |
టెలిఫోన్ రిసీవర్ వైర్లు రౌండ్ షేపులోనే ఎందుకు ఉంటాయి?.. ఇదీ అసలు కారణం!
X

దిశ, ఫీచర్స్: మనం డైలీ ఎన్నో వస్తువులను చూస్తుంటాం. ఒక్కో వస్తువు ఒక్కో ఆకారంలో ఉంటుంది. కాయిన్స్ రౌండ్ షేపులో, స్పూన్లు కర్వుడ్‌ షేపులో, అద్దాలు ఓవల్ షేపులో దర్శనమిస్తుంటాయి. ఇవి మాత్రమే కాదు, ఇలా అనేక వస్తువులు వాటి ప్రాధాన్యత, ప్రజల అవసరం, మెటల్ క్వాలిటీ, వినియోగదారుల ఆసక్తి, టూల్ సెట్టింగ్ ప్రయారిటీస్‌ను బట్టి ఆయా డిజైన్లు, ఆకారాలుగా సంతరించుకోవడంలో కీ రోల్ పోషిస్తుంటాయి. అలాంటి వాటిలో టెలిఫోన్ రిసీవర్ వైర్ కూడా ఒకటి. అయితే దీని ఆకారం రింగులు రింగులుగా ఎందుకు ఉంటుంది? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. కానీ పదేండ్ల క్రితం వరకు ప్రజలు ల్యాండ్ లైన్ ఫోన్లే ఎక్కువగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. అయితే అవి ఏ రకం టెలిఫోన్ అయినప్పటికీ రిసీవర్ వైర్ మాత్రం స్పైరల్ ఆకారంలో రింగులు తిరిగి ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంటోంది. ఫోన్ బాక్స్, సిగ్నల్ టెక్నాలజీ మోడ్రన్ రూపం సంతరించుకున్నప్పటికీ రిసీవర్ వైర్ మాత్రం అలానే ఉంది.

టెలిఫోన్ రిసీవర్ వైర్లు రింగులుగా చుట్టుకొని ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇలా ఉండటం కంఫర్ట్‌గా ఉంటుంది. సాధారణంగా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చేతితో రిసీవర్‌ను అటూ ఇటూ లాగుతుంటాం. ఫ్యామిలీ మెంబర్స్‌ మాట్లాడుకునే సందర్భలో ఫోన్ ఒకరి చేతిలో నుంచి మరొకరి చేతిలోకి మారుతూ ఉంటుంది. ఆ సమయంలో వైర్ లాగుతూ ఉంటారు. అప్పుడు వైర్లు తెగిపోవడం, ఫోన్లు కిందపడటం వంటివి జరగవచ్చు. అదే రింగులు కలిగి ఉంటే కంఫర్టుగా ఉండి చేతులు మారే సందర్భంలో కిందపడవు. ఫోన్ బాక్సు జరుపుకోకుండానే రీసీవర్‌ను అనువైన మార్గంలో తిప్పుకునే చాన్స్ ఉంటుంది. అందుకే దానిని అలా తయారు చేశారట.

మరొక కారణం ఏంటంటే.. ఫోన్ రిసీవర్ వైర్ రింగులుగా ఉండటంవల్ల త్వరగా పాడవదు. స్పైరల్ వైర్లు లాగినా డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువ. స్ట్రయిట్‌గా ఉండే కేబుల్ వైర్ల మాదిరి ఉంటే, ఫోన్‌ను ఒకరి చేతి నుంచి మరొకరి చేతిలోకి తీసుకునే క్రమంలో బెండ్ అయిపోయి బ్రేక్ అయ్యే చాన్స్ ఉంటుంది. కానీ రౌండ్ షేప్ వైర్లకు ఇలా జరగదు. డ్యామేజ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. అలాగే ఎలక్ట్రానిక్ ఇంటర్‌ఫీయరెన్స్ కూడా ఉండదు. గుండ్రంగా చుట్టబడిన వైర్లు ఉండటంవల్ల ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి వచ్చే సిగ్నల్స్ కారణంగా ఫోన్ కాల్స్‌ కట్ కావడం, డిస్టర్బెన్స్ రావడం వంటివి జరగవు. అందుకే ఎలక్ట్రానిక్ నిపుణులు టెలిఫోన్ రిసీవర్ వైర్లను రౌండ్ షేపులో డిజైన్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed