ఏప్రిల్ 1ని ఫూల్స్ డే గా ఎందుకు జరుపుకుంటారు..? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..

by Sumithra |
ఏప్రిల్ 1ని ఫూల్స్ డే గా ఎందుకు జరుపుకుంటారు..? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : ఫూల్స్ డే అంటే ఏప్రిల్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత. దీని బాధితులని ఏప్రిల్ ఫూల్స్ గా వ్యవహరించడం పరిపాటి. కొన్ని వార్తా పత్రికలు, మ్యాగజైన్లు కూడా ఒక్కోసారి అసత్య కథనాలను ప్రచారం చేస్తూ ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు ఎక్కడో చిన్న అక్షరాలతో వివరణ ఇస్తుంటారు. 19 వ శతాబ్దం నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన ఫూల్స్ డే ఏ దేశంలోనూ సెలవు దినం కాదు. జెఫ్రీ షాసర్ రాసిన ద కాంటర్ బరీ టేల్స్ (1392) లో దీని గురించి ప్రస్తావన ఉంది. ఈ రోజున ఒక పాట కూడా రూపొందించారు. ‘ఏప్రిల్ ఫూల్ బనాయా తో ఉంకో గుస్సా ఆయా’ అనే ఈ పాటను మీరు కూడా చిన్నతనంలో వినే ఉంటారు. 1964లో విడుదలైన సినిమా పేరు కూడా ‘ఏప్రిల్ ఫూల్’.

భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఏప్రిల్ ఫూల్ జరుపుకుంటారు. నవ్వులు, జోకులతో నిండిన ఈ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ సరదాగా ఉంటుంది. ఈ రోజున ప్రజలు తమ కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులను ఏదో ఒక విధంగా ఏప్రిల్ ఫూల్ చేయడంలో బిజీగా ఉంటారు. ప్రస్తుతానికి మనం ఏప్రిల్ ఫూల్ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం.

ఏప్రిల్ ఫూల్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది ?

నిజానికి, ఏప్రిల్ ఫూల్స్ డే వేడుక 16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. అయితే 1582లో, ఫ్రెంచ్ రాజు జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ చాలా మంది ప్రజలు ఈ మార్పును అర్థం చేసుకోలేదు, అలాగే అంగీకరించలేదు. ఏప్రిల్ 1న నూతన సంవత్సర వేడుకలను కొనసాగించారు. అలాంటి వారిని "ఏప్రిల్ ఫూల్స్" అని ఎగతాళి చేసేవారు.

ఏప్రిల్ 1న ఫూలింగ్ సంప్రదాయం వెనుక కథ..

ఏప్రిల్ 1 రోమన్ పండుగ హిలేరియాని జరుపుకుంటారు. హిలేరియా అనే పదానికి ఉల్లాసంగా లేదా ఆనందంగా అని అర్థం. ఈ పండుగలో ఒకరినొకరు హేళన చేసుకునేవారు.

భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే ప్రారంభమవుతుంది..

భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే 19వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో భారత్ ని బ్రిటిష్ వారు పాలించారు. అలాగే వారి సంస్కృతిని కూడా ఇక్కడ విస్తరించారు. ఆ సంప్రదాయాలలో ఏప్రిల్ ఫూల్స్ డే కూడా ఒకటి.

హిందూ పురాణాల ప్రభావం..

కొంతమంది వ్యక్తులు ఈ పండగకు హిందూ పురాణాల ప్రభావం కూడా కారణం కావచ్చని చెబుతుంటారు. హిందువులు చైత్ర మాసం హోలీ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఆ రోజున ప్రజలందరూ ఆనందంగా ఒకరి పై ఒకరు రంగులను జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అంతే కాదు సరదాగా ఆట పట్టించేందుకు తప్పుడు సమాచారాలు కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయం కూడా "ఏప్రిల్ ఫూల్స్ డే" ఒక కారణం కావచ్చని భావిస్తారు.

Advertisement

Next Story