క్యాన్సర్‌పై WHO కీలక హెచ్చరిక.. 2050 వరకు జరిగేది ఇదేనంట!

by Jakkula Samataha |
క్యాన్సర్‌పై WHO కీలక హెచ్చరిక.. 2050 వరకు జరిగేది ఇదేనంట!
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులు జంక్ ఫుడ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, వర్క్ టైమింగ్స్ లాంటి ఇతర కారణాల వలన చాలా మంది క్యాన్సర్ భారిన పడుతున్నారు. కాగా, క్యాన్సర్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసింది. 2050 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 35 మిలియన్లకు పైగా పెరుగుతుందని, ఇది 2022 కంటే 77 శాతం ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ ఏజెన్సీ తెలిపింది.

ఇక కేసుల పెరుగుదలకు పొగాకు, ఆల్కహాల్, వాయుకాలుష్యం ముఖ్యకారణమని ఇంటర్నేషనల్ ఎజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ తెలిపింది.అలాగే ఇది వేగంగా పెరుగుతున్న జనాభ, వృద్ధులు,ఇద్దరిపై ప్రభావం చూపనుందంట. అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో 2022‌తో పోలిస్తే 2050లో4.8 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతాయని, కానీ HDIకు తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు 142 శాతం రిస్క్ ఫేస్ చేయగా, మీడియం రేంజ్‌లో ఉన్న దేశాలు 99 శాతం పెరుగుదలను నమోదు చేయగా, ఈ దేశాల్లో క్యాన్సర్ మరణాలు 2050 నాటికి రెట్టింపు అవుతాయంట.అలాగే ప్రపంచ క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా, తక్కువ వనరులు ఉన్న దేశం పై పడనుందని పరిశోధకులు తెలిపారు.

Advertisement

Next Story