Viral video : డీసీఎంలో వెళ్తూ యువతి అత్యుత్సాహం.. రీల్ కోసం డ్యాన్స్ చేస్తుండగా చివరికి..!

by Javid Pasha |
Viral video : డీసీఎంలో వెళ్తూ యువతి అత్యుత్సాహం.. రీల్ కోసం డ్యాన్స్ చేస్తుండగా చివరికి..!
X

దిశ, ఫీచర్స్ : ఏదో ఒక రకంగా తాము సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆలోచన ఇటీవల యువతలో బాగా పెరుగుతోంది. అందుకోసం రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అంత వరకూ ఓకే కానీ.. కొందరు రీల్స్ పిచ్చితో వెర్రి వేషాలు వేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వెరైటీగా చేసి పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో పలువురు రిస్కులో పడుతున్నారు. అలాంటి ఓ సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీసీఎంలో వెళ్తూ రీల్స్ చేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ యువతి ఐడియా చివరికి బెడిసి కొట్టింది. ఆమెకు ఎదురైన పరిస్థితిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఓ డీసీఎం వ్యాన్‌ రోడ్డుపై నుంచి వెళ్తోంది. అందులో వెనుక భాగంలో కొందరు నిలబడి ఉన్నారు. అందులో ఓ యువతి కూడా ఉంది. కాగా అంతలోనే సదరు యువతికి ఓ రీల్ చేస్తే బాగుంటుందనే ఐడియా తట్టినట్లుంది. ఏ మాత్రం ఆగకుండా అత్యుత్సాహం ప్రదర్శించింది. ఓ సాంగ్ ప్లే అవుతుండగా.. అందులో లీనమై మరీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కానీ ఇంతలోనే ఊహించని సంఘటన జరిగింది. డ్యాన్స్ చేస్తున్న యువతి అదుపు ఒక్కసారిగా డీసీఎంలోంచి కిందకు జారిపడింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. చూసిన వారంతా ఫన్నీగా నవ్వుకుంటున్నారు. మరికొందరు పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదేనంటూ కామెంట్లు పెడుతుండగా.. వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని కూడా పలువురు విమర్శిస్తున్నారు. అందుకే రీల్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు.

Video Credits to ragin-sa on X id

Advertisement

Next Story

Most Viewed