- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టైఫాయిడ్ శరీరంలోని ఏ అవయవాలపై దాడి చేస్తుంది?
దిశ, ఫీచర్స్: టైఫాయిడ్ జ్వరం అనేది ఎంటెరిక్ ఫీవర్‌లో సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది ఫుడ్ పాయిజన్ సమస్యకు కూడా దారి తీస్తుంది. కలుషితమైన నీరు, ఆహారాలవల్ల టైఫాయిడ్‌ను కలిగించే బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల తీవ్రమైన జ్వరంతోపాటు అలసట, తలనొప్పి, వంటి వంటి లక్షణాలు ఉంటాయి. అయితే టైఫాయిడ్‌ను కలిగించే బాక్టీరియా ఏది? అది శరీరంలోని ఏయే అవయవాలపై దాడి చేస్తుందో తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 21 మిలియన్ల మంది ఎంటెరిక్ ఫీవర్ (టైఫాయిడ్) బారిన పడుతున్నారు. మన దేశంతోపాటు మిడిల్ ఈస్ట్, యూరప్, సౌత్, సెంట్రల్ అమెరికా దేశాలు తరచూ టైఫాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తీవ్రమైన టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ మరణానికి కూడా దారి తీస్తుంది కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నాలుగైదు రోజులకు మించి ఫీవర్ ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. టైఫాయిడ్ జ్వరంలో టైఫాయిడల్ సాల్మొనెల్లా, నాన్-టైఫాయిడల్ సాల్మొనెల్లా వంటి రకాలు ఉన్నాయి. ఆకలి మందగించడం, తీవ్రమైన అలసట, శారీరక బలహీనత, తలనొప్పి, శరీర భాగాల్లో నొప్పి, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం వంటివి టైఫాయిడ్ లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
టైఫాయిడ్ జ్వరం అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో ప్రారంభమై శరీరంలోని వివిధ అవయవాలను ప్రభావితం చేస్తుంది. బాక్టీరియా బ్లడ్ సర్క్యులేషన్‌లో చేరి కాలేయం, ప్లీహం, కండరాలు, జీర్ణశయాంతర పేగులపై దాడి చేస్తుంది. క్రమంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు కూడా చేరుతుంది. కాబట్టి టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడంవల్ల ప్రాణాపాయం తప్పుతుంది.