- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలంటే?
దిశ, ఫీచర్స్ : తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఏప్రిల్ 9న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఈరోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు.
అనంతరం ఉతికిన శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి గడపకు పసుపు,కుంకుమ అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇంటి ముందు రంగు రంగులతో పెద్దగా ముగ్గులు వేస్తారు. ఆరోజు ప్రతి పల్లె, ప్రతి వాడ పిల్లల సందడి, పంచాంగ శ్రవణంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండక్కి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఈ క్రమంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరికి తెలియదు.కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఉగాది పండక్కి కాలమే దైవం, కనుక ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి అంట. శ్రీ మహా విష్ణువు, శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పండితులు. అలాగే ఇష్టదేవతల స్తోత్రములు పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉంటుంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీవితం కష్టసుఖాల మయం అని చెప్పడం దీని సారాంశం.