- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరాశలో మీరున్నప్పుడు.. ఆశల నిచ్చెనై వస్తారు!
దిశ, ఫీచర్స్ : ఎలాంటి వారికైనా ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఏదో నిరాశలో కూరుకుపోతుంటారు. మరికొన్నిసార్లు తాము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎవరితోనూ చెప్పుకోలేకపోతారు. ఇంకొన్నిసార్లు చెప్పుకున్నా ఫలితం ఉండదేమోనని బాధపడుతుంటారు. లోలోన కుమిలిపోతుంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోనే ఓ అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది. మీరు పెద్దగా చెప్పకపోయినా, మీ మనసును అర్థం చేసుకునే ఓ వ్యక్తి మీ భుజం తడతారు. డోంట్ వర్రీ అంటూ ధైర్యం నూరిపోస్తారు. ఇబ్బందుల నుంచి బయటపడే వరకు మీకు సపోర్టుగా నిలుస్తారు. ఇలాంటి బంధాన్నే సపోర్టివ్ రిలేషన్‌షిప్‌గా పేర్కొంటున్నారు నిపుణులు.
ఆలోచనలు మొదలు బాధ్యతల వరకు
అంతకుముందే పరిచయం అయిన వ్యక్తి కావచ్చు. ఫ్రెండ్, కొలీగ్, బాస్, ఆత్మీయులు ఇలా.. ఎవరైనా కావచ్చు. ఆదప సమయాల్లో మీ వెన్నంటే ఉంటారు. ఆలోచనల్లో, భావాల్లో, భావోద్వేగాల్లో, బాధ్యతల్లో మిమ్మల్ని గమనిస్తుంటారు. ప్రతీ విషయంలో మిమ్మల్ని అనుసరిస్తూ, అర్థం చేసుకుంటూ, సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిరాశలో మీరు కూరుకుపోతే ఆశల నిచ్చెనలా మారి మిమ్మల్ని అవతలి గట్టుకు చేరుస్తారు. నిజానికి ఇలాంటి మద్దతువల్లే ఎంతో మంది కార్యాలయాల్లో, పరిశ్రమల్లో, తామున్న ప్రతీ రంగంలో ముందుకు సాగుతుంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతుంటారు. సపోర్టివ్ రిలేషన్‌షిప్‌కి ఉన్న పవర్ అలాంటిది అంటున్నారు నిపుణులు.
ఆరోగ్యంపై సానుకూల ప్రభావం
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానసిక, శారీరక ఆరోగ్యంపై సపోర్టివ్ రిలేషన్స్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతాయని, ఆపదలో, ఆనందంలో, ఆవేశంలో, చివరికి అనారోగ్యంలో కూడా మీ శ్రేయస్సును కోరుతూ మీ యోగ క్షేమాలు అడుగుతూ, మీతో ఆలోచనలు పంచుకుంటూ, సలహాలు ఇస్తూ అండగా నిలుస్తుంటారు కొందరు. ఈ విధమైన సపోర్టివ్ రిలేషన్స్ వల్ల మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొండిన భావన ఏర్పడుతుంది. అది మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని ధైర్యవంతులుగా మారుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. జీవిత భాగస్వామి, ఫ్యామిలీ మెంబర్ కూడా చేయని అద్భుతం మీ హృదయాంతరాలకు దగ్గరగా ఉండే ఓ వ్యక్తి చేయవచ్చు. అతను లేదా ఆమెనే మీ సపోర్టివ్ రిలేటెడ్. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ మీకంటూ కొందరు లేదా ఒకరు సపోర్టివ్ రిలేషన్స్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు.
ఆటంకాలను అధిగమించడంలో..
నిపుణుల ప్రకారం.. ఎటువంటి ఆటంకాలనైనా సరే.. వాటిని అధిగమించడంలో సపోర్టివ్ రిలేషన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఒంటరితనంతో మీరు బాధపడుతున్నప్పుడు, సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు, అభద్రతా భావం వెంటాడుతున్నప్పుడు ఈ బంధాలే మిమ్మల్ని తట్టిలేపుతాయి. ఆలోచన సంఘర్షణలను ప్రేరేపిస్తాయి. మిమ్మల్ని అర్థం చేసుకొని ఆపదల నుంచి బయటపడేస్తాయి. మీలోని నిరాశా నిస్పృహలను పారదోలుతాయి. అందుకే ఇతరులకు మీరు సపోర్టుగా ఉంటూ పోతే.. మీక్కూడా సపోర్టివ్ రిలేషన్ పరిధి పెరుగుతుంది. జీవితంలో ఇది చాలా ముఖ్యమంటున్నారు మానసిక నిపుణులు.