- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్వలాభం కోసం అబద్దాలు.. ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నపుడే ఎక్కువ
దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్ కంటే ల్యాప్‌టాప్ ఉపయోగించినప్పుడు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలు అబద్ధాలు చెప్పేందుకు ఎక్కువ ఇష్టపడతారని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. అనేక అధ్యయనాల తర్వాత ఈ ఫలితాలను నిర్ధారించిన రీసెర్చర్స్.. మొదట 'టేక్-ఇట్-ఆర్-లీవ్-ఇట్' ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఒక ప్లేయర్‌కు కొంత మొత్తంలో డబ్బు అందుతుందని చెప్పారు. అయితే తాము పొందిన మొత్తంలో ఎంత మేర పార్ట్‌నర్‌కు అందించేందుకు సిద్ధంగా ఉన్నారో ప్లేయర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు తమ దగ్గర ఎక్కువ మనీ ఉంచుకునేందుకు వారు అబద్దాలు చెప్పేందుకు వీలు కల్పించారు.
అధ్యయనంలో పాల్గొన్న సగం మంది వ్యక్తులు తమ భాగస్వామితో కమ్యూనికేట్ చేయడానికి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించగా మిగిలిన వారు తమ స్మార్ట్‌ఫోన్స్ వాడారు. కాగా ల్యాప్‌టాప్స్ యూజ్ చేసేవారు దాదాపు 82 శాతం అబద్ధాలు చెప్పే అవకాశం ఉందని పరిశోధకులు గమనించారు. ఇదిలా ఉంటే.. కేవలం 62 శాతం మంది ఫోన్ యూజర్స్ సగటున అబద్ధం చెప్పడాన్ని ఎంచుకున్నారు. ఈ లెక్కన ఇద్దరి మధ్య వ్యత్యాసం 20 శాతం ఉంది.
ఇదే కాక.. ఒక ఫ్యాక్టరీ కొనుగోలు ధరకు సంబంధించి బేరమాడే మరో ప్రయోగాన్ని నిర్వహించారు. 222 మంది విద్యార్థులను కొనుగోలుదారులు, విక్రేతలుగా విభజించి ఆస్తి మార్కెట్ విలువ $21 మిలియన్లుగా అంచనా వేయబడిందని కొనుగోలుదారులకు సీక్రెట్‌గా తెలిపారు. ఆ తర్వాత వారు ప్రారంభ మార్కెట్ విలువ గురించి విక్రేతలను అడగాల్సి ఉంటుంది. ఈ మేరకు మునుపటి ప్రయోగంలో వలె సగం మంది విద్యార్థులకు ఫోన్లు, మిగతావారు ల్యాప్‌టాప్స్‌పై ఆస్తి విక్రయ కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరిపారు. అయితే ఇక్కడ కూడా ల్యాప్‌టాప్ యూజర్లు మోసపూరితంగా వ్యవహరించారు. వీరు సగటున అమ్మకందారులకు సరసమైన విలువ $16.7 మిలియన్లు అని చెప్తే.. ఫోన్ యూజర్లు $18.1 మిలియన్లుగా చెప్పారు. ఈ లెక్కన ఫోన్ యూజర్లు కోట్ చేసిన ధరల కంటే ల్యాప్‌టాప్ యూజర్లు కోట్ చేసిన ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ ఫోన్లు.. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను ప్రేరేపించాయి. ల్యాప్‌టాప్స్ మాత్ర పని, విజయం, సంబంధిత ఆలోచనలకు దారితీశాయి. అంటే ప్రొఫెషనలిజం అనైతిక ప్రవర్తనను ప్రేరేపించగలదని తెలిసింది. మొత్తానికి సాంకేతికత ఉపయోగం సూక్ష్మంగా ఇంకా ప్రాథమికంగా మెదడు పని చేసే విధానాన్ని మార్చగలదని రుజువైంది.