- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాఖీ పండుగ ఎప్పుడు.. 30, 31కా పండితులు ఏం చెబుతున్నారంటే?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా చెప్పుకునే పండుగ రాఖీ. సాధారణంగా రాఖీ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది అన్నా చెల్లెల్లకు, అక్క తమ్ముళ్లకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అయితే ఈ సారి అధిక శ్రావణ మాసం రావడంతో ఎప్పుడు జరుపుకోవాలో అన్న సందిగ్ధత నెలకొంది. రాఖీ పండుగ బుధవారం జరుపుకోవాలా లేక గురువారం జరుపుకోవాలా అని అందరూ అయోమయంలో పడిపోయారు. పండితులు మాత్రం ఈ ఏడాది పండుగ రెండు రోజులు వచ్చిందని చెబుతున్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.1 వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి.