హోమియోపతి అన్ని వయసుల వారికి సురక్షితం : నిపుణులు

by sudharani |
హోమియోపతి అన్ని వయసుల వారికి సురక్షితం : నిపుణులు
X

దిశ, ఫీచర్స్: హోమియోపతి అనేది 200ఏళ్లుగా ఉపయోగించబడుతున్న ప్రత్యామ్నాయ వైద్య విధానం. ‘లైక్ విత్ లైక్’ ప్రిన్సిపుల్‌ ఆధారంగా ఈ ట్రీట్మెంట్ అందించబడుతుండగా.. రోగి పూర్తి ఆరోగ్య సంరక్షణకు శారీరక, మానసిక, భావోద్వేగ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని వైద్యం అందించే మెడికల్ ప్రాసెస్. కానీ ఇది నిజంగా పని చేస్తుందా? హోమియోపతి బేసిక్స్ ఏంటి? ఎంత వరకు ఎఫెక్ట్ చూపగలదు? తెలుసుకుందాం.

హోమియోపతి అంటే ఏమిటి?

హోమియోపతి 18వ శతాబ్దం చివరలో శామ్యూల్ హానెమాన్ అనే జర్మన్ వైద్యునిచే డెవలప్ చేయబడింది. ఇది ‘సిమిలియా సిమిలిబస్ క్యూరాంటూర్’ లేదా ‘లైక్స్ ఆర్ క్యూర్‌డ్ బై లైక్స్’ అనే సూత్రం ఆధారంగా రూపొందించబడింది. అంటే ఆరోగ్యకరమైన వ్యక్తిలో సింప్టమ్స్‌కు కారణమయ్యే ఒక పదార్థం.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో అవే లక్షణాలను నయం చేయగలదు. హోమియోపతి రెమిడీస్ మొక్కలు, ఖనిజాలు, జంతు ఉత్పత్తుల వంటి సహజ పదార్థాల నుండి తయారు చేయబడతాయి. ఈ పదార్థాలు నీటిలో లేదా ఆల్కహాల్‌లో కరిగించబడతాయి. ‘సక్యూషన్’ అని పిలువబడే ప్రాసెస్.. పదార్థం యొక్క వైద్య లక్షణాలను సక్రియం చేస్తుందని నమ్ముతారు.

ఇక హోమియోపతి కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేయకుండా, మొత్తం వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తుంది. కాబట్టి హోమియోపతి చికిత్సను సూచించే ముందు వ్యక్తి శారీరక, మానసిక, భావోద్వేగ లక్షణాలతో పాటు వారి జీవనశైలి, వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకుంటారు. హోమియోపతి అనేది సున్నితమైన, నాన్-ఇన్వాసివ్ ఔషధం కాగా అన్ని వయసుల వారికి సురక్షితం.

పని చేస్తుందా?

హోమియోపతి ప్రభావం చాలా చర్చనీయాంశమైంది. కొంతమంది హోమియోపతిని పూర్తిగా నమ్మితే.. మరికొందరు దాని ప్రభావంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని అధ్యయనాలు కొన్ని పరిస్థితులకు ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తే.. మరికొన్ని స్టడీస్ దాని ఉపయోగానికి మద్దతుగా ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. ఎందుకంటే హోమియోపతిని స్టడీ చేసేందుకు సైంటిఫిక్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా కఠినమైన అధ్యయనాలను రూపొందించడం సవాళ్లతో కూడుకుని ఉంది. హోమియోపతి అనేది ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలను పరిగణనలోకి తీసుకునే సంక్లిష్టమైన వైద్య విధానం. ఇది ఒక వ్యక్తి యొక్క చికిత్సను మరొకరితో పోల్చడం కష్టతరం చేస్తుంది. అదనంగా ఇందులో ఉపయోగించే డైల్యూషన్ ప్రాసెస్ అంటే.. ఔషధంలోని క్రియాశీల పదార్థం తరచుగా చాలా కరిగించబడుతుంది. దీన్ని ప్రయోగశాలలో డిటెక్ట్ చేయడం కష్టతరం అవుతోంది.

ఈ సవాళ్లు ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితులకు హోమియోపతి ప్రభావవంతంగా ఉంటుందని సూచించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. హోమియోపతిపై 225 అధ్యయనాల సమీక్షలో అలెర్జీలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వంటి పరిస్థితులకు ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. మైగ్రేన్‌ల తీవ్రత, ఫ్రీక్వెన్సీని తగ్గించడంలో హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ చేయగలదని మరొక అధ్యయనం కనుగొంది. అయినప్పటికీ, ఇతర అధ్యయనాలు హోమియోపతి ఉపయోగానికి మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. UKలోని హౌస్ ఆఫ్ కామన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ 2010 నివేదిక ప్రకారం హోమియోపతి ప్లేసిబో(రియల్ ట్రీట్మెంట్‌లా అనిపిస్తుంది కానీ కాదు) కంటే ఎక్కువ ప్రభావవంతమైనది కాదు.

ఈ పరిస్థితులకు చికిత్స చేయడానికి హోమియోపతి ప్రభావవంతంగా పరిగణించబడుతుంది

* అలర్జీలు

* గాయాలు

* క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్(దీర్ఘకాలిక అలసట)

* జలుబు, దగ్గు

* డిప్రెషన్

* తలనొప్పి

* ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్

* మైగ్రేనక

* వికారం

* ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్

* కీళ్ళ వాతము

* స్క్రేప్స్

* పంటి నొప్పులు

Advertisement

Next Story

Most Viewed