బ్లూబేబీ సిండ్రోమ్

by srinivas |
బ్లూబేబీ సిండ్రోమ్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా కొందరు శిశువులు పుట్టుకతోనే గుండెలో రంధ్రంతో జన్మిస్తారు. ఇలాంటి పిల్లలకు వైద్యులు కొన్నిసార్లు వెంటనే ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరిస్తారు. కానీ కొందరికి మాత్రం కొంత కాలం పాటు ఆపరేషన్‌ వాయిదా వేస్తుంటారు. ఇలా సర్జరీ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల సంఖ్య ఎక్కువే కాగా. వీరికి వేసవిలో ప్రత్యేక సంరక్షణ అవసరం అంటున్నారు నిపుణులు. గుండె వైఫల్యం వంటి ఇతరత్ర గుండె జబ్బుల బారిన పడిన చిన్నారుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ఇందుకు సంబంధించిన సూచనలు అందిస్తున్నారు.

పుట్టుకతో వచ్చే గుండె లోపాల్లో చాలా రకాలున్నాయి. వీటిలో 20శాతం మంది పిల్లలు ‘బ్లూబేబీ సిండ్రోమ్’తో బాధపడుతున్నారు. వ్యాధి పేరుకు తగినట్లుగానే ఈ శిశువులు తరుచూ నీలంగా మారిపోతుంటారు. గట్టిగా ఏడ్చినా పెదవులు, గోళ్లు, ముఖం వంటి శరీరభాగాలు బ్లూకలర్‌కు చేంజ్ అవుతుంటాయి. మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోవడమే ఇందుకు కారణం కాగా.. ఇలాంటి లక్షణాలుంటే గుండెలో లోపం ఉందని గుర్తించి, వెంటనే వైద్యులకు చూపించాలని సూచిస్తున్నారు. దీనినే వైద్య పరిభాషలో ‘సైనోటిక్ హార్ట్ డిసీజ్’ అని పిలుస్తుంటారు.

బ్లూబేబీ సిండ్రోమ్ అంటే?

సాధారణ ఆరోగ్యవంతుల్లో గుండె మంచి రక్తాన్ని శరీరం అంతటా సరఫరా చేస్తుంది. ఆ మంచి రక్తం ఒంట్లోని ప్రతికణానికి ఆక్సిజన్‌ను అందిస్తుంటుంది. ఆ ఆక్సిజన్‌ను కణాలు వాడేసుకున్న తర్వాత మిగిలే చెడు రక్తం- తిరిగి మళ్లీ గుండెకు, అక్కడి నుంచి శుద్ధి కోసం ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇలా మంచి రక్తం, చెడు రక్తం ఒళ్లంతా ధమనుల్లో, సిరల్లో వేర్వేరుగానే ప్రవహిస్తుంటాయి. గుండెలో కూడా ఇవి కలిసి పోకుండా ప్రత్యేకంగా వేర్వేరు గదులున్నాయి. అయితే గుండెలో లోపాలున్న ఈ బిడ్డల్లో ముఖ్యంగా గుండె గదుల మధ్య ఉండే గోడలకు రంధ్రాలున్న పిల్లల్లో ఈ మంచి-చెడు రక్తాలు రెండూ కలిసి పోతుంటాయి. దీని వల్ల సాధారణంగా మన రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితినే ‘హైపాక్సియా’ అంటారు.

ఇలా రక్తంలో ఆక్సిజన్ శాతంఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉండటం వల్ల ఈ పిల్లల శరీరం.. ముఖ్యంగా నాలుక, పెదవులు, గోళ్లలో నీలం రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చెడు రక్తం- మంచి రక్తంతో కలిసి శరీరమంతా ప్రవహించటం వల్ల ఒంట్లోని చాలా అవయవాలకు ఆక్సిజన్ తగినంతగా అందదు. దీంతో రక్తం సరిపోవటం లేదన్న ఉద్దేశంతో మన శరీరం వేగంగా స్పందిస్తూ.. రక్తం మరింత ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తంలోని ఎర్రకణాలు ఎక్కువగా ఉత్పత్తి కావడంతో వాటి సంఖ్య చాలా ఎక్కువై.. రక్తం బాగా చిక్కగా తయారవుతుంది. వేసవిలో సమస్యలు తలెత్తటానికి ఇదే మూలం.

Clinical Director and Head of Department – Paediatric Cardiothoracic Surgery

Dr. Tapan Dash

CARE Hospitals Banjara Hills

Ph: 040 61 65 65 65

Advertisement

Next Story