Varalakshmi Vratham: రేపే వరలక్ష్మి వ్రతం.. మహిళలంతా ఈ రంగు చీర కట్టుకుని పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చు

by Anjali |
Varalakshmi Vratham: రేపే వరలక్ష్మి వ్రతం.. మహిళలంతా ఈ రంగు చీర కట్టుకుని పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చు
X

దిశ, ఫీచర్స్: శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం మహిళలంతా ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తారు. స్త్రీలందరికి వరలక్ష్మి వ్రతం అంటే చాలా ప్రత్యేకం. ఈ వ్రతం కోసం గత కొద్ది రోజుల ముందు నుంచే కొత్త బట్టల కోసం షాపింగ్‌లు చేస్తారు. ఇల్లును మొత్తం కొత్తింటిలా రుపుదిద్దుతారు. పూలు, పెయింటింగ్స్‌తో కలర్‌ఫుల్‌గా అలంకరించుకుంటారు.

పెళ్లికాని యువతుడు మంచి భర్త రావాలని,పెళ్లైన మహిళలు భర్త సంతోషంగా ఉండాలని, ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలని అమ్మవారికి ఎంతో నిష్ఠగ ఫాస్టింగ్ ఉంటారు. అయితే నేడు వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారికి పూజ చేసే మహిళలంతా ఈ రంగు చీర కట్టుకుంటో మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అయితే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చు కానీ అమ్మవారికి గోల్డ్ కలర్ శారీ అంటే ఇష్టం కాబట్టి ఆ కలర్ చీర కట్టుకుని పూజ చేస్తే మంచి ఫలితం దక్కుతుందని అంటున్నారు. అలాగే లక్ష్మిదేవికి గ్రీన్ కలర్, గులాబీ కలర్స్ ఎంతో ప్రీతికమైనవట. కాగా ఈ రంగు చీరలు కట్టుకుని పూజలో కూర్చుంటే సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు

Advertisement

Next Story