- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చలికాలంలో జామ ఆకు టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
దిశ, ఫీచర్స్: మిగతా కాలాలతో పోల్చుకుంటే చలికాలం అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఏ వ్యాధైనా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాగా చలికాలంలో ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తరచూ వైద్యులు చెబుతూనే ఉంటారు. చాలామంది చలికాలం ఎక్కువగా వేడి వేడి పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఎక్కువ మంది టీ, కాఫీ సమోసా బజ్జీలు లాంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఎప్పుడూ తాగే టీ, కాఫీలు మాత్రమే కాకుండా చలికాలంలో జామ ఆకులతో తయారు చేసిన టీ తాగితే హెల్త్‌కు ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ జామ ఆకు టీ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జామ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాగా జామ ఆకు టీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్ లతో పోరాడటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ వీటిలో ఉంటాయి. ఈ ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలో మంటను తగ్గించడంతో పాటు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. అజీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను దరిచేరనివ్వవు. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జామ ఆకుల్లో అధికంగా ఉంటాయి కాబట్టి చలికాలంలో జామ ఆకు టీ తాగితే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎన్నో అధ్యయనాలు జామ ఆకులో హైపోగ్లైసీమిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయని నిరూపించాయి. ఈ సమ్మేళనాలు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మేలు చేస్తాయి. కాగా రోజుకొక కప్పు జామ ఆకు టీ తాగడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.