- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రలో వచ్చే కలలు నిజమవుతాయా?.. అసలు ఎందుకు వస్తాయి?
దిశ, ఫీచర్స్ : అందమైన ప్రదేశంలో ఇష్టమైన వ్యక్తులతో కలిసి విహరిస్తున్నట్లు మీరెప్పుడైనా కలగన్నారా?, ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించి దిగ్గున నిద్రలేచారా?’ అయితే అవి మీ మనసులో మెదలుతున్న లోతైన భావాలకు ప్రతిబింబం కావచ్చు. ఎందుకంటే నిద్రలో కనే కలలకు, కలవరింతలకు, వాస్తవ జీవితానికి మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. రియల్ లైఫ్‌లో ఎదుర్కొనే అనుభవాలు, ఆలోచనలు, మెదడులో జరిగే పరిణామాల ఆధారంగా అవి ఎందుకు వస్తాయో, అర్థం ఏమిటో సైకాలజిస్టుల, న్యూరో బయాలజిస్టుల థియరీస్ వెల్లడిస్తు్న్నాయి.
చీటింగ్ చేసినట్లు
మిమ్మల్ని ఎవరో చీటింగ్ చేసినట్లు లేదా మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసినట్లు కలగనడం కొన్నిసార్లు మీలోని ఆందోళనకు కారణం కావచ్చు. అయితే ఇలాంటి కల కొన్నిసార్లు అసాధారణమేమీ కాదు. అది మీలోని అవిశ్వాసానికి, భయాలకు ప్రతిబింబం అయి ఉండవచ్చు. బహుశా మిమ్మల్ని ఒక ముఖ్యమైన వ్యక్తి మోసం చేయడం లేదా చేస్తారని తరచుగా ఊహించుకోవడంవల్ల కూడా ఈ కలలు రావచ్చు. అలాగే కలలో చీటింగ్ చేసేది మీరే అయితే గనుక, అది మీ జీవితంలో ఒక కొత్త అంశంగా భావించవచ్చు. మీ సబ్‌కాన్షియస్ మీ రిలేషన్‌షిప్‌కు దూరంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
పరీక్ష రాసినట్లు
మీరు కలలో పరీక్ష రాయడం అనేది మీ వైఫల్యం యొక్క అంతర్లీన భయాన్ని బహిర్గతం చేస్తుంది. ఎగ్జామ్స్ ఒత్తిడితో కూడిన అనుభవాలను అందించడమే దీనికి కారణం. అలాగే ఫెయిల్ అవడం, అవుతామని ఆందోళన చెందడం, ప్రిపేర్ కావడంలో నిర్లక్ష్యం కారణంగా.. పరీక్షలు సమీపించే ఏం జరుగుతుందోననే ఆలోచనలతో గడపడం కూకడా ఇలాంటి కలలు రావడానికి కారణం కావచ్చు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదర్కోవడానికి సిద్ధంగా లేరనే అర్థాన్ని కూడా ఈ కలలు సూచిస్తాయి.
మరణం సంభవించినట్లు
మరణం గురించి కలలు ముఖ్యంగా కలతకు కారణం అవుతాయి. అలాంటి కలలు మార్పు గురించి ఆందోళన లేదా తెలియని భయాన్ని ప్రతిబింబిస్తాయని చెప్తుంటారు. అయితే తరచూ వ్యాధుల బారిన పడేవారు, తమను చూసుకునేవారు ఎవరూ లేరనే ఆలోచనలతో గడిపేవారు నిద్రలో ఇటువంటి కలలు కనే అవకాశం ఎక్కువ. ఓదార్పు కోరుకునే వారు, వ్యాపారంలో నష్టపోయినవారు కూడా తాము చనిపోయినట్లు కలలు కనే అవకాశం ఎక్కువ.
డబ్బులు కోల్పోవడం
డబ్బును గెలుపొందడం గురించి కలలు కనడం అనేది మీరు ఆశాజనకంగా ఉన్నారని సూచిస్తుంది. అయితే డబ్బు కోల్పోవడం గురించి కలలు కనడం మీ నిజ జీవితంలో ప్రతికూల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. డబ్బు నిర్వహణలో ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఎక్కువగా మీ ఆలోచనలు డబ్బు అవసరాల చుట్టూ తిరగడం ఈ విధమైన కలలు రావడానికి మరొక కారణం.
ఎవరో వెంబడించినట్లు
మీరు పారిపోవడం లేదా మిమ్మల్ని ఎవరైనా వెంబడించడం వంటి కలలు రావడం మీలోని ఆందోళనకు కారణం కావచ్చు. ఒక సమస్య నుంచి తప్పించుకోవాలని, దాని నుంచి బయట పడటానికి ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తుంటే గనుక ఈ కలలు రావచ్చు. అలాగే మీరు ఇతరుల వద్ద అప్పుతీసుకొని తీర్చేందుకు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక సమస్యను పరిష్కరించే మార్గం తోచనప్పుడు మీ మనసులో చెలరేగే భాధాకరమైన భావాలు కూడా ఇటువంటి కలలకు కారణం అవుతాయి.
ఇరకాటంలో పడటం
ఏదో ఒక సమస్యలో చిక్కుకోవడం లేదా ఇరకాటంలో పడటం, ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేయడం వంటి కలలు రావడం మీలోని ఆందోళనకు ప్రతిబింబం. నిజ జీవితంలో మీరు తరచూ నిరాశ చెందుతుండటం, ఉద్యోగంలో రిటైర్మెంట్ తేదీ దగ్గర పడుతుండటం, ఇతరులతో తరచూ విభేదాల నేపథ్యంలో మీ ఆలోచనలు ఇటువంటి కలలు రావడానికి కారణం అవుతాయి. ఇవి శక్తిహీనత, పరిస్థితిలో మార్పు చేయలేకపోవడం వంటి భావాలతో ముడిపడి ఉంటాయి.
సెలబ్రిటీతో గడపడం
సెలబ్రిటీ కలిసి తిరగడం వంటి కలలు సదరు వ్యక్తుల్లో ఆరాధించే లక్షణాలను సూచిస్తాయి. మిమ్మల్ని మీరు సాకారం చేసుకోవాలకోవడం, ప్రత్యేక జీవనశైలి కారణాలవల్ల కూడా ఇటువంటి కలలు వస్తుంటాయి. ఇక మీరు ఇతరుల ద్వారా ప్రశంసించబడాలని కోరుకోవడం, ఆ దిశగా ఆలోచించండం చేస్తున్నారని ఈ కలలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా గౌరవించబడాలని తరచూ ఆలోచించడం కూడా ఇందుకు కారణం.
పక్షిలా ఎగిరినట్లు
మీకు రెక్కలు వచ్చినట్లు, ఆకాశంలో పక్షిలా ఎగిరిపోతున్నట్లు కలలు కనడం ఉత్తేజకరమైనవిగా, విముక్తి కలిగించేవిగా ఉంటాయి. కానీ మీరు ఎత్తులకు భయపడితే అవి కూడా భయపెట్టవచ్చు. సహజంగా ‘ఎగిరే కలలు’ తరచుగా రెండు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. అవి స్వేచ్ఛ, స్వాతంత్ర్య భావాలను ప్రతిబింబిస్తాయి లేదా జీవిత వాస్తవాల నుంచి పారిపోవడం, తప్పించుకోవడం అనే కోరికను కూడా సూచిస్తాయి.
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినట్లు..
గర్భం ధరించినట్లు కలగనడం అనేది సృజనాత్మకత నుంచి భయం వరకు ప్రతిదానిని సూచిస్తాయని డ్రీమ్ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. అలాగే మీరు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇటువంటి కలలు వస్తుంటాయి. మీరు పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోకపోయినా, ఆసక్తిలేకపోయినా ఇటువంటి కల వచ్చిందంటే మీలో ఏదో ఆలోచన పెరుగుతోందని అర్థం. కొత్త ఆలోచన మీరు చేసే పనిలో, ఉద్యోగంలో ఉన్నతి నుంచి ప్రమోషన్ వరకు ఏదైనా కావచ్చు.
నగ్నంగా విహరించినట్లు
మీరు బహిరంగ ప్రదేశంలో నగ్నంగా విహరించడం లేదా స్నానం చేయడం వంటి కలలు కనడం సాధారణంగా మీ దైనందిన జీవితంలో ఏదో ఒకదానితో అనుసంధానించబడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మీరు ఏదైనా హాని కలిగి ఉన్నారని అతిగా ఆలోచిస్తూ ఉండటం, లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ ఉండటం కారణంగా ఇటువంటి కలలు వస్తాయి. అలాగే ఎటువంటి ప్రతికూల, భయానక ఆలోచనలు లేకపోయినా నగ్నంగా ఉన్నట్లు కలలు వస్తున్నాయంటే బహుశా మీరు ఇతరుల ద్వారా ఆకర్షించబడాలని, ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలని తరచూ భావించే వారు అయి ఉండవచ్చు.
కింద పడిపోవడం
మీరు కలలో కింద పడిపోవడం, ఎత్తైన ప్రదేశం నుంచి లోయలోకి జారిపోవడం వంటి కలలు భయం, ఆందోళన లేదా ద్రోహం యొక్క భావాలను ప్రతిబింబిస్తాయి. మీ ఆలోచనలు మీ నియంత్రణలో లేక పోవడంతో కూడా ఇటువంటి కలలు వస్తుంటాయి. మీరు డిస్పపాయింట్స్ అయ్యే సంఘటనలు, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, నిరాశకు గురైనప్పుడు, ఒక విషయంలో ఎక్కువగా ఆశపడినప్పుడు ఇటువంటి కలలు వచ్చే చాన్స్ ఉంటుంది.
దంతాలు కోల్పోవడం
చాలామందికి వచ్చే సాధారణ కలల్లో దంతాలు ఊడిపోయినట్లు కలనగడం ఒకటి. మీరు ఒకరితో మాట్లాడటానికి మీ మొహం లేదా పళ్లు బాగాలేవని తరచూ ఆలోచించేవారైతే ఇలాంటి కలలు వస్తాయి. అలాగే కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం మీలో లేదని ఆందోళన చెందడంవల్ల కూడా వస్తాయి.
వాయిస్ కోల్పోవడం
మీరు వాయిస్ కోల్పోవడం, ఇతరులకు కాల్ చేయలేకపోవడం లేదా సహాయం కోసం అరవడం వంటి కలలు గనడం, సెల్ప్-ఎక్స్‌ప్రెషన్, దృఢత్వం, కాన్ఫిడెంట్ యొక్క అవసరాన్ని సూచిస్తాయి. మీరు నిజ జీవితంలో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకోవడం ఈ కలలు రావడానికి ప్రేరణగా ఉంటాయి. అయితే ఇవి కేవలం కలలే కాదు, కొన్నిసార్లు స్లీప్ పెరాలిసిస్ ఫలితంగానూ ఇటువంటి ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిద్రలోకి జారుకున్న తర్వాత తిరిగి మేల్కొనే ముందు కండరాల నియంత్రణను తాత్కాలికంగా కోల్పోవడం కూడా ఇటువంటి పరిస్థితికి దారితీస్తుంది.
ఆహారంతో నిండిన టేబుల్
ఆహారానికి సంబంధించిన కలలు పాజిటివ్ లేదా నెగెటివ్‌గా ఉండవచ్చు. ఉదాహరణకు రకరకాల పదార్థాలతో నిండిన టేబుల్ గురించి కలలు కనడం అంటే మేల్కొనే జీవితంలో మీరు హైలెవల్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్ మెంట్ అనుభవించి ఉండవచ్చు లేదా అలా అనుభవించాలని కోరికను కలిగి ఉండవచ్చు. ఇక విషపూరితమైన ఆహారాన్ని తిన్నారని కల వస్తే, మీరు జీవితంలో వదిలించుకోవాల్సిన వ్యక్తులు, పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు.