- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐదు నిమిషాలకు ఒకరిని చంపేస్తున్న సిగరెట్
దిశ, ఫీచర్స్: ధూమపానం ప్రతీ ఐదు నిమిషాలకు ఒకరిని చంపేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. 2019లో లక్షా 25వేల మంది పొగాకు కారణంగా చనిపోయారని క్యాన్సర్ రీసెర్చ్ యూకే కనుగొంది. దేశంలో క్యాన్సర్ మరణాలకు సిగరెట్లే అతిపెద్ద కారణం కాగా ఏటా దాదాపు 55,000 మంది చనిపోయేందుకు కారణమవుతుంది. గత నెలలో యూకేలో పొగాకు కారణంగా 17వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వీటిలో 7600 మంది క్యాన్సర్ రోగులే. అందుకే పొగాకు నియంత్రణకు ‘స్మోక్ ఫ్రీ ఫండ్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న స్వచ్ఛంద సంస్థలు.. లేదంటే మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి.
ధూమపాన రహిత యూకే కోసం ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రధానమంత్రికి అందజేసే పిటిషన్‌పై సంతకాలు చేసేందుకు పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలో 2030 నాటికి బ్రిటన్‌ను పొగ రహితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోంది. స్మోకింగ్ ఆపేందుకు ప్రజారోగ్య ప్రచారం, అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. అంటే అప్పటికీ ఆ దేశస్థులు ఐదు శాతం కంటే తక్కువ మంది ధూమపానం చేస్తారు.
Also Read..