- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలికాలంలో బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవ్వి తింటే జీరో సైజే!
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఊబకాయం, అధిక బరువు. ఇలాంటి వారు వారి బరువును తగ్గించుకునేందుకు ఎంతగానో శ్రమపడుతూ ఉంటారు. వ్యాయామాలు చేయడం, డైట్ ఫాలో అవ్వడం చేస్తుంటారు. దీంతో కొంత మంది త్వరగా బరువును తగ్గుతారు. మరి కొంత మంది కాస్త నెమ్మదిగా తగ్గుతారు. వేసవి కాలంలో త్వరగా బరువు తగ్గినా చలికాలంలో మాత్రం కాస్త కష్టమే అనుకోవాలి. ఎందుకంటే శీతాకాలంలో జీవక్రియ పనితీరు నెమ్మదిగా ఉండి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాంటప్పుడు జీవక్రియ పనితీరును ఉత్తేజపరిచే ఆహారం తీసుకోవాలని నిపుణుల చెబుతున్నారు. మరి అలాంటి ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి..
శీతాకాలంలో త్వరగా బరువు తగ్గాలంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, నెయ్యి, బెల్లం మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే శీతాకాలంలో పండే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తాయి. ఇలాంటి వాటిని భుజిస్తే శీతాకాలంలో త్వరగా బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
2. నీటి శాతాన్ని ఎక్కువగా తీసుకోవాలి..
ఎక్కువగా ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా నీటిని శాతాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుందట. అంతేకాదు బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటుందట. అందుకే వేసవి కాలమైనా, శీతాకాలమైనా శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
3. ఆల్కహాల్ శాతాన్ని తగ్గించాలి..
శీతాకాలంలో చాలా మంది ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తాగడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే ఆల్కహాల్ పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కూడా చెబుతున్నారు. అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వలన శరీరంలో అదనపు కేలరీలు చేరుతాయట. అందుకే ఆల్కహాల్‌ను పరిమితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
4.డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలి..
బరువు తగ్గాలనుకునే వారు డిటాక్స్ డ్రింక్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలట. ఇది బరువు తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుందట. ప్రతిరోజు ద్రాక్ష, కీరదోస, ఆరెంజ్, నిమ్మరసం, పుదీనా, ఆపిల్ వంటి వాటిని ఈ డ్రింక్స్‌లో ఉపయోగించాలట. శరీరంలో స్టోర్ అయిన టాక్సిన్స్, కొవ్వును కరిగించడానికి ఈ డ్రింక్స్ పనిచేస్తాయి.
5. బ్రేక్ ఫాస్ట్..
బరువు తగ్గాలనుకునేవారు ప్రాసెస్ ఫుడ్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని, లైట్ ఫుడ్‌ని తీసుకోవడం ద్వారా బరువుని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.