Viral Video : పామును చూడగానే ఆ యువతి చేసిన పనికి అందరూ షాక్.. ఏం జరిగిందంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-22 06:44:36.0  )
Viral Video : పామును చూడగానే ఆ యువతి చేసిన పనికి అందరూ షాక్.. ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న రీల్స్, వెరైటీ స్టంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వర్షాకాలం నేపథ్యంలో ఈ మధ్య రకరకాల పాములకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ రెండు సన్నివేశాలు ఒకే దగ్గర కనిపించే ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో ఓ అందమైన యువతి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. పింక్ కలర్ శారీ కట్టుకున్న ఓ అందమైన యువతి ఇంటిలోకి దూరిన ‘రాట్ స్నేక్‌’ను గమనిస్తుంది. ఇక ఏమాత్రం భయపడకుండా దానిని పట్టుకొని బయటకు వస్తుంది. తర్వాత ఒక సంచిలో బంధించి, ఊరిబయటకు తీసుకెళ్లి అటవీ ప్రాంతంలోని పొదల్లో వదిలేస్తుంది. కాగా ఈ పామును ఆ యువతి పట్టుకోవడంతోపాటు దానిని వదిలేసే ముందు కాసేపు ఆ సిచ్యువేషన్‌ను ఆమెతో పాటు అక్కడున్నవారంతా ఎంజాయ్ చేయడం, ఏ మాత్రం భయపడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలైతే లేవు కానీ.. ‘సైబా’ అనే ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్‌లో ‘రాట్ స్నేక్ రెస్క్యూ’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్టు చేయగా తెగ వైరల్ అవుతోంది.

Video Credits To saiba-19 Insta Id

Advertisement

Next Story

Most Viewed