Viral Video : వేగంగా వెళ్తున్న కారు సన్‌రూఫ్‌పై ఉద్వేగభరితంగా ముద్దులు పెట్టుకున్న జంట.. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఘటన

by Sujitha Rachapalli |
Viral Video : వేగంగా వెళ్తున్న కారు సన్‌రూఫ్‌పై ఉద్వేగభరితంగా ముద్దులు పెట్టుకున్న జంట.. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఘటన
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య వేగంగా వెదులుతున్న కార్లు, బైకులపై లవర్స్ రొమాన్స్ చేయడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్పీడ్ గా దూసుకుపోతున్న కారు ఓపెన్ రూఫ్ పై ఓ జంట ఉద్వేగభరితంగా ముద్దులు పెట్టుకోవడం వైరల్ అవుతుంది. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలోని.. 1090 రౌండ్‌అబౌట్, ముఖ్యమంత్రి నివాసం మధ్య జరిగినట్లు సమాచారం. కాగా గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన లక్నోలో ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడిన జంటపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అశ్లీల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోపై రియాక్ట్ అయిన లక్నో పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, పూర్తయ్యాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక రీసెంట్ గా ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు ముద్దుపెట్టుకుంటూ పట్టుబడ్డారు. ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలోని తరగతి గదిలో నుంచి ఓ విద్యార్థి ఈ వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్లిప్పింగ్ కాస్త వైరల్ కావడంతో యూనివర్సిటీ అధికారులపై విమర్శలు వచ్చాయి. దీంతో వీడియో ప్రామాణికతను చెక్ చేసిన నోయిడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Advertisement

Next Story

Most Viewed