VIRAL VIDEO: కొత్త జంటకు ఫ్రీ వెడ్డింగ్ షూట్.. తాత డైరక్షన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే

by Kavitha |
VIRAL VIDEO: కొత్త జంటకు ఫ్రీ వెడ్డింగ్ షూట్.. తాత డైరక్షన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు ఖర్చుకు వెనుకాడకుండా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందుకోసం పెద్ద పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్లను సంప్రదించి అందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుండి అప్పగింతల వరకు ప్రతిదీ కాస్త వెరైటీగా ఉండాలని అందరూ చెప్పుకునేలా ఉండాలంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లికి సంబంధించిన విషయాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కామన్ అయిపోయింది. అయితే వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కొత్త జంట తమ పెళ్లి కోసం ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం కోసం ఈ జంట కాస్త మంచి కాస్ట్యూమ్ వేసుకొని ఈవెంట్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. అయితే వారికి ఫ్రీ వెడ్డింగ్ లొకేషన్ ఓ నది వద్ద బోర్డ్ లో ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఆ కొత్త జంటకు ఫోటోలకు ఫోజులు ఎలా ఇవ్వాలో దూరం నుంచి ఈవెంట్ మేనేజర్ సూచనలు ఇస్తున్నాడు. అయితే అతను చెప్పినది వారికి సరిగా అర్థం కాకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు.

ఆ సమయంలో ఆ బోటు నడుపుతున్న ఓ పెద్దాయన వెంటనే వారిని చూసి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా చేయి పెట్టండి, అలా అమ్మాయిని పట్టుకోండి, అలా నడుము దగ్గర చేయి పెట్టి అంటూ.. సూచనలు ఇస్తూ వారికి సహకరించాడు. ఇకపోతే కొత్త జంట ఆ పెద్దాయన సూచనలు ఇవ్వడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story