- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RO ప్యూరిఫైయర్ నుంచి బయటకు వచ్చే వృథా నీటిని వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో నీటి శుద్ధి ఏర్పాట్లు వాటర్ ప్యూరిఫైయర్లు కచ్చితంగా ఉంటున్నాయి. అపరిశుభ్రమైన వాటర్ ను శుద్ధి చేయడానికి చాలా మంది ఆర్‌ఓ ను యూజ్ చేస్తున్నారు. దీని నుంచి వేస్ట్ వాటర్ బయటకు పోతాయి. అయితే వృథాగా పోయిన నీటిని కొంతమంది ఇతర పనులకు ఉపయోగిస్తుంటారు.
కామన్ గా ఒక ఆర్‌ఓ 3 లీటర్ల వాటర్ నుంచి 1 లీటర్ నీటిని శుద్ధి చేస్తుంది. కాబట్టి చాలా వాటర్ వేస్ట్ అవుతాయి. మరీ ఈ నీటితో స్నానం చేయొచ్చా? పలు పనులకు యూజ్ చేసుకోవచ్చా? చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొవాల్సి వస్తుందా? అంటూ చాలా మందికి సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిల్లర్ నుంచి వేస్ట్ అవుతున్న వాటర్ ను స్నానం చేయడానికి లేదా తాగడానికి వాడకూడదు. ఈ నీటిలో మొత్తం కరిగిన ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. ఈ RO ప్రక్రియ ద్వారా విడుదలైన వ్యర్థ నీటిలో పలు రకాలైన అకర్బన లవణాలు, సేంద్రియ పదార్థాలు, మలినాలను కలిగి ఉంటాయి.
ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. ఈ కారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు. RO నుంచి రిలీజైన నీటిని కారు, టూ వీలర్ వాహనాలను క్లీన్ చేయడానికి యూజ్ చేయవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ నీరు-ఇంటెన్సివ్ సబ్జెక్ట్. టాయిలెట్ శుభ్రం చేయడానికి, ఇళ్లు తుడుచుకోవడం వంటి కొన్ని పనుల కోసం వాడుకోవచ్చంటున్నారు.