యూనిఫామ్ కష్టాలు.. ఆటల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్న స్టూడెంట్స్

by sudharani |
యూనిఫామ్ కష్టాలు.. ఆటల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్న స్టూడెంట్స్
X

దిశ, ఫీచర్స్: పాఠశాల యూనిఫాం విధానాలు యువతను, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ బాలికలను శారీరక శ్రమలో పాల్గొనకుండా చేస్తున్నాయని కొత్త పరిశోధన వెల్లడించింది. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ అంతర్జాతీయంగా ఐదు నుంచి 17 ఏళ్ల లోపు వయస్సు మధ్య గలవారి ఫిజికల్లీ పార్టిసిపేంట్స్‌కు సంబంధించిన డేటాను అధ్యయనం చేశారు. దీనికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ ఫ్యాకల్టీ, MRC ఎపిడెమియాలజీ యూనిట్ పరిశోధకుడు డాక్టర్‌ మైరెడ్‌ ర్యాన్‌ నాయకత్వం వహించారు.

పెద్ద వయసు గల విద్యార్థుల కంటే చిన్న పిల్లలు స్కూల్లో రోజు మొత్తంలో ఎక్కువ వ్యాయామం చేస్తారని ఈ సర్వే ద్వారా వివరించవచ్చని నిపుణలు సూచిస్తున్నారు. ఉదాహరణకు బ్రేక్, లంచ్ టైంలో రన్నింగ్, క్లైంబింగ్‌, యాక్టివ్‌ ప్లే ఇలా అనేక ఇతర రూపాల్లో అమ్మాయిలు ధరించే దుస్తుల ద్వారా వారు ఆటల్లో చురుకుగా పాల్గొనలేకపోతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్స్ పిల్లల శారీరక శ్రమను పరిమితం చేస్తాయని ఫలితాలు ఖచ్చితంగా నిరూపించలేదు. అలాగే, కారణాన్ని ఊహించలేము అని పరిశోధకులు నొక్కి చెప్తున్నారు. అంతే కాకుండా ఇంతకుముందు జరిగిన కొన్ని చిన్న అధ్యయనాలకు ఈ పరిశోధన మద్దతునిస్తూ.. యూనిఫామ్‌లు అడ్డంకిని కలిగిస్తాయని సూచిస్తున్నాయి.

యువకులు వారంలో రోజుకు సగటున 60 నిమిషాలు ఎక్కువ శారీరక శ్రమను పొందాలని WHO సిఫార్సు చేస్తోంది. చాలా మంది పిల్లలు, యుక్త వయసు గలవారు ఈ సిఫార్సును, ముఖ్యంగా బాలికలకు అనుగుణంగా లేవని మునుపటి అధ్యయనాలు చెప్తున్నాయి. అన్ని దేశాలలో శారీరక శ్రమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే అబ్బాయిలు, బాలికల శాతంలో సగటున 7.6 శాతం వ్యత్యాసం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. దీనికి యూనిఫాంలు ఒక కారణంగా ఉండవచ్చని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, బాలికల PE యూనిఫామ్‌లు, పాఠశాల స్పోర్ట్స్‌ కిట్‌ల గురించి గతంలో ఆందోళనలు లేవనెత్తబడ్డాయి. ఇంగ్లండ్‌లో 2021లో జరిపిన ఒక అధ్యయనంలో బాలికల PE యూనిఫామ్‌ల రూపకల్పన విద్యార్థులను కొన్ని కార్యకలాపాలలో పాల్గొనకుండా నిరోధించినట్లు తేలింది. అయితే, హాకీ క్రీడాకారిణి టెస్‌ హోవార్డ్ ఇంటర్వ్యూ, సర్వే డేటాను విశ్లేషించిన తర్వాత ఇలాంటి కారణాల వల్ల జెండర్డ్ స్పోర్ట్స్ యూనిఫామ్‌లను పునఃరూపకల్పన చేయాలని ప్రతిపాదించారు.

Advertisement

Next Story

Most Viewed