Aanvi Kamdar : చనిపోయినా వదల్లేదు... ఆడపిల్ల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-20 05:04:04.0  )
Aanvi Kamdar : చనిపోయినా వదల్లేదు... ఆడపిల్ల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ద్వారా చాలా మంది జీవితాలు నిలబడుతున్నాయి. ఉపాధి మార్గంగా ఎంచుకుని లక్షలు సంపాదిస్తున్నారు. మహారాష్ట్ర ముంబైకి చెందిన ఇన్ ఫ్లుఎన్సెసర్ అన్వి కందార్ కూడా భారీ ఫాలోవర్స్ తో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. అందరికీ యూజ్ ఫుల్ కంటెంట్ ఇస్తూ బెస్ట్ అనిపించుకుంది. అయితే ఈ మధ్య కుంబ్లే వాటర్ ఫాల్ దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కింద పడిపోవడంతో చనిపోయింది. దీంతో కుటుంబీకులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కానీ ఎప్పటిలాగే చనిపోయిన ఆమెపై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 'ఇప్పుడు రీల్ చేయు.. రీల్ ఎక్కడ?... ఫేక్ డెత్ ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చనిపోయినా ఇంత నెగెటివిటీ ఎందుకని..మరణించే సమయంలో ఆమె చేతిలో మొబైల్ కూడా లేదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని.. ఇలాంటి బిహేవియర్ అస్సలు మంచిది కాదని అంటున్నారు. కనీసం చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలియకుండా.. ఆమె డెత్ గురించి నవ్వుకోవడం సైకోయిజం అనిపించుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story