Traffic Rules: ట్రాఫిక్‌ పోలీసులు మీ బైక్‌ కీస్‌ లాక్కోవచ్చా? రూల్స్‌ ఏం చెబుతున్నాయాంటే?

by Kavitha |
Traffic Rules:  ట్రాఫిక్‌ పోలీసులు మీ బైక్‌ కీస్‌ లాక్కోవచ్చా? రూల్స్‌ ఏం చెబుతున్నాయాంటే?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మనం బైక్ పై వెళ్తుంటే కొన్ని సార్లు ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఆపి తనిఖీలు చేస్తారు. అలా చేసినప్పుడు మన దగ్గర డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, హెల్మెట్‌ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్లు, వస్తువులు ఉంటే ఎలాంటి సమస్య లేదు. కానీ ఏదైనా ఒకటి లేకపోతే వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ కీస్‌ చేతికి తీసుకుని, వెహికల్‌ రోడ్డు పక్కన పెట్టమంటుంటారు. మరి ఇలా ట్రాఫిక్‌ పోలీసులు మన వెహికల్ కీస్‌ లాక్కోవచ్చా? ఇలాంటప్పుడు మనకున్న హక్కులు ఏంటి? మనం ఏం చేయొచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బేసిక్‌గా ట్రాఫిక్‌ పోలీసులు కీస్‌ లాక్కోవడం సరైనదా కాదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం, కారు లేదా బైక్ కీలను తీసుకునే హక్కు ట్రాఫిక్ పోలీసులకు లేదు. ఎవరైనా ఇలా చేస్తే, మీరు ట్రాఫిక్ పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు. లేదా మీరు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వీడియో రికార్డు చేయవచ్చు.

అసలు ట్రాఫిక్‌ పోలీసులు ఎందుకు కీస్‌ తీసుకుంటారు?

ట్రాఫిక్ పోలీసులు చాలా సార్లు చెకింగ్ సమయంలో, రైడర్లు తప్పించుకోవడానికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే.. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కీస్‌ తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల సంబంధిత వ్యక్తి ద్విచక్ర వాహనంను డ్రైవ్‌ చేయలేడు కాబట్టి.

మీ బైక్ కీస్‌ తీసుకుంటే ఏం చేయాలి?

ముందుగా, కామ్‌గా ఉండి..పోలీసులతో గౌరవంగా మాట్లాడండి. అలాగే వారి మాటలు జాగ్రత్తగా వింటూ సూచనలను ఫాలో అవ్వండి. అలా కాకుండా అధికారితో దురుసుగా ప్రవర్తిస్తే అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మీ వాహనం కీస్‌ ఎందుకు తీసుకొన్నారు. మీరు ఏ రూల్ బ్రేక్ చేశారో పోలీసులను అడిగి తెలుసుకోండి. అప్పుడే మీరు ఏం తప్పు చేశారో మీకు అర్థం అవుతుంది. ఏదైనా ట్రాఫిక్ రూల్‌ బ్రేక్ చేసినట్లు తేలితే, మీరు చలాన్ రిసీవ్ చేసుకుని పెనాల్టీ చెల్లించాలి. చలాన్‌ తప్పకుండా జారీ చేయాలని సంబంధిత ట్రాఫిక్‌ పోలీసుని కచ్చితంగా అడగాలి. అది మీ బాధ్యత.

అలా జరిమానా చెల్లించిన తర్వాత, ట్రాఫిక్‌ పోలీసులు మీ వెహికల్‌ కీస్‌ని తిరిగి ఇచ్చేస్తారు. అలా కాకుండా పోలీసులు మీ వెహికల్‌ కీస్‌ని సరైన పద్ధతిలో తీసుకోకపోతే, మీరు సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు. మీతో అధికారులు సక్రమంగా వ్యవహరించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎలాంటి చలాన్లు కట్టడానికి అవకాశం కల్పించకండి.

Advertisement

Next Story