- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tooth Paste - IQ : పిల్లల తెలివితేటలు తగ్గిస్తున్న టూత్ పేస్ట్.. తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు
దిశ, ఫీచర్స్ : సాధారణంగా తాగు నీటిలో ఫ్లోరైడ్ స్థాయిలు సిఫారసు చేయబడిన దాని కంటే అధికంగా ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన డెంటల్ ఫ్లోరోసిస్ , స్కెలెటల్ ఫ్లోరోసిస్, బలహీనమైన ఎముకలతో సహా అనేక దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వివరించాయి. అయితే తాజాగా యూఎస్ ప్రభుత్వ నివేదిక తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ పిల్లల తెలివితేటల పై ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. లీటరు నీటికి 1.5 మి. గ్రా. కన్నా అధిక ఫ్లోరైడ్ కు గురవుతున్న చిన్నారుల్లో తక్కువ IQ ఉంటుందని చెప్పింది.
నిజానికి దంతాలను బలోపేతం చేయడానికి, కావిటీస్ ను నివారించడానికి తాగునీటిలో ఫ్లోరైడ్ యాడ్ చేస్తారు. దీన్ని ప్రజారోగ్య సాధనంగా ట్రీట్ చేస్తారు. అయితే దంతాల ఆరోగ్యానికి టూత్ పేస్ట్ లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఫ్లోరైడ్ స్థాయి అధికం అయిపోయి పిల్లల్లో నరాల సంబంధిత ప్రమాదాలకు కారణం అవుతుందని హెచ్చరిస్తుంది అధ్యయనం. గర్భిణీ స్త్రీలు, పిల్లలపై ఫ్లోరైడ్ ప్రభావాన్ని అధ్యయనం చేసిన ఫ్లోరిడా విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇలాంటి ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం అని తెలిపారు.