- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 21: నేడు అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం
దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో ‘‘టీ’’ తాగాని వారు ఉండరు అనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో టీ ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారి జీవితంటో టీ చాలా ప్రభావాన్ని చూపుతుంది. దీనిని డాక్టర్లు సైతం ఆంగికరించడమే కాకుండా.. టీ ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.
తలనొప్పికి, రీప్రెష్ అవ్వడానికి, టైంపాస్‌కు ఇలా సమయం, సందర్భంతో పని లేకుండా చాలా మంది ‘‘టీ’’‘ తాగుతూ ఉంటారు. ప్రతి ఏటా మే 21 వ తేదీన అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి 2019 డిసెంబరు 21న తేదీని తీర్మానించింది. దీంతో అప్పటినుంచి ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాగా టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం మే 21న ప్రధాన లక్ష్యం.
5వేల సంవత్సరాల క్రితం చైనాలో మొట్టమొదటి టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. ఇండియాతో పాటు నేపాల్, శ్రీలంక, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషఇయా, ఉగాండా, టాంజానియా వంటి టీ తయారు చేసే దేశాల్లో 2005 నుంచి ఇంటర్‌నేషనల్ టీ రోజును జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ కార్యక్రమాలను నిర్వహించి సమావేశమవుతాయి.
Also Read...