- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Adulterated Ghee : కల్తీ నెయ్యిని కనిపెట్టలేక పోతున్నారా.. ఇలా నిమిషాల్లో గుర్తించండి
దిశ, ఫీచర్స్ : పూర్వం నుంచి భారతీయుల్లో చాలామంది దేశీ నెయ్యి తినడానికి ఎక్కువగా ఇష్ట పడుతూ ఉంటారు. దేశీ నెయ్యి తింటే శరీరం దృఢంగా, బలంగా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల ఎముకలు దృఢంగా ఉండేందుకు, దేశీ నెయ్యి తినడం, దాంతో మర్దన చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. పూర్వం నెయ్యిని ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసేవారు. అప్పుడు అందులో కల్తీకి ఆస్కారం ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఆహార పదార్థాలే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. అలాగే అక్కడక్కడా స్వచ్చమైన దేశీ నెయ్యితో పాటు కల్తీ నెయ్యి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి కల్తీ నెయ్యిని తినడం వలన ఆరోగ్యం మాట దేవుడెరుగు. ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆస్పత్రుల పాలవ్వక తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేశీ నెయ్యిలో కల్తీని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిని నీటిలో వేసి చెక్ చేయాలి..
దేశీ నెయ్యి కల్తీదా లేదా స్వచ్చమైనదా తెలుసుకునేందుకు ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లని తీసుకోవాలి. ఆ నీళ్లలో ఒక చెంచా దేశీ నెయ్యి వేసి, చెంచాతో కలపాలి. అది కల్తీ నెయ్యి అయితే అది నీటిలో త్వరగా కరగదు. ఒకవేళ స్వచ్చమైన నెయ్యి అయితే అది నీటిలో కరిగి జిడ్డులా తేలుతుంది.
నెయ్యి రంగు..
కల్తీ నెయ్యి ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. దాని రంగు కూడా కాస్త తెల్లగా కనిపిస్తుంది. స్వచ్చమైన నెయ్యి లేత పసుపు రంగులో కనిపిస్తుంది.
అయోడిన్ ద్రావణం..
ఏదైనా ఆహార పదార్థాన్ని చెక్ చేసేందుకు అయోడిన్ ద్రావణంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ద్రావణంతో దేశీ నెయ్యిని కూడా సులువుగా చెక్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసి దానికి కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేసి కలపాలి. కొంత సమయం తర్వాత మీరు దాని రంగులో మార్పును చూసినట్లయితే, నెయ్యి కల్తీ కావచ్చు. ఈ విధంగా మీరు కల్తీ నెయ్యిని కనుగొనవచ్చు.