రుచికరమైన పెరుగును చేయాలనుకుంటున్నారా.. ఈ ట్రిక్‌ను ఉపయోగించండి..

by Sumithra |
రుచికరమైన పెరుగును చేయాలనుకుంటున్నారా.. ఈ ట్రిక్‌ను ఉపయోగించండి..
X

దిశ, ఫీచర్స్ : భారతీయ వంటగదిలో పెరుగును విస్తృతంగా ఉపయోగిస్తారు. భోజనంలో పెరుగుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తారు. అలాగే వంటల రుచిని పెంచడానికి కూడా పెరుగును కలుపుతారు. అయితే పెరుగు ప్రతిరోజూ షాపుల్లో కొనకుండా ఇంట్లో తయారు చేయడం మరింత ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు మార్కెట్‌లో లాగా చిక్కని పెరుగు ఎలా తయారవుతుందనే సమస్య చాలా మందికి తలెత్తుతోంది. అలాంటి టేస్టీ పెరుగును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు మీ పొట్టను ఉన్న అనేక సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ చర్మం మెరుపును కూడా పెంచుతుంది. వేసవిలో పెరుగు ఎక్కువగా తీసుకుంటారు. బజారు నుంచి తెచ్చిన పెరుగు అయిపోగానే చాలామంది ఇంట్లో పెరుగును చేస్తుంటారు. దానికోసం పాలు మరిగిన తర్వాత అది గోరువెచ్చగా అయ్యే వరకు మీరు వేచి ఉండాలి. ఇప్పుడు పెరుగు తయారు చేయాల్సిన పాత్రలో పాలు పోయాలి. ఇప్పుడు 4 నుంచి 5 పచ్చి మిరపకాయలు తీసుకుని పాలలో వేయాలి. దీని తర్వాత రాత్రిపూట గది ఉష్ణోగ్రత వద్ద పాలు వదిలివేయండి. ఉదయానికి పెరుగు మార్కెట్ లో లాగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రిజ్‌లో ఉంచి మధ్యాహ్న భోజనం లేదా అల్పాహారం కోసం తాజాగా సర్వ్ చేసుకోవచ్చు.

లేదా మరిగిన పాలు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత రెండు చెంచాలా పెరుగును వేసి బాగా కలిపి రాత్రంతా బయటే ఉంచాలి. అలా చేయడం ద్వారా మంచి రుచికరమైన పెరుగు రెడీ అయినట్టే. తర్వాత వెంటనే దాన్ని ఫ్రిజ్ లో పెట్టి సర్వ తీసుకోండి.

పెరుగు చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..

పెరుగు చేసేటప్పుడు చిక్కగా మీగడ ఉన్న పాలు తీసుకుంటే పెరుగు చిక్కగా మారుతుంది.

పెరుగు గట్టిగా కావాలంటే పాత్రను టవల్‌తో కప్పండి.

క్రీమీ పెరుగు చేయాలనుకుంటే, మరిగే సమయంలో పాలపొడి జోడించండి.

పెరుగును చేసిన తరువాత దానిని 2 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story