- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంపడమే కాదు ప్రేమను పంచడంలోనూ ఆరితేరిన పులులు
దిశ, ఫీచర్స్: మనుషుల్లో దయ, కఠినత్వం లాంటి వ్యక్తిత్వ లక్షణాలు పులుల్లో కూడా ఉంటాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. 248 సైబీరియన్ పులుల ప్రవర్తనను గమనించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇందుకోసం నార్మల్ హ్యూమన్ పర్సనాలిటీ టెస్ట్‌ను ఉపయోగించిన సైంటిస్టులు.. విశ్వాసం, చిత్తశుద్ధి, బెదిరింపు, క్రూరత్వం వంటి 70 లక్షణాలను పరిగణలోకి తీసుకున్నారు. వాటితో రోజువారీగా పనిచేసే పశువైద్యులు, ఫీడర్ల నుంచి ఇందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మొత్తానికి ఫలితాల్లో పులులు ఘనత(Majesty), స్థిరత్వం(Steadiness) అని రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఇందులో ‘ఘనత’ కోరుకుంటున్న పులులు.. గంభీరతతో ఆరోగ్యంగా ఉన్నాయి. సజీవ జంతువులను వేటాడతూ, హ్యాపీగా తిని జీవిస్తున్నాయి. అదే సమయంలో ‘స్థిరమైన’ పులులు సున్నితంగా, మరింత నిజాయితీగా, ప్రేమగా చూపించబడ్డాయి. ఈ అధ్యయనం పులుల వ్యక్తిత్వాలలో చాలా తక్కువ సెక్స్-సంబంధిత వ్యత్యాసాలు ఉన్నట్లు కనుగొంది. సాధారణంగా పులి పిల్లలు రెండు నుంచి మూడేళ్ల వరకు తల్లితోనే ఉంటాయి. కానీ తండ్రి పులులు కూడా తమ పిల్లలను పెంచడంలో పాలుపంచుకోవడం గమనించబడింది. టైగర్ అంటే ఆధిపత్యం, క్రూరత్వం, పోటీ, దూకుడుగా ఉండాల్సిన అవసరం లేదనే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: ప్రాణభయంతో దొర్లుతున్న పాము..