- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్షా బంధన్.. అన్నాచెల్లెళ్లకేనా?
దిశ, ఫీచర్స్ : రక్షాబంధన్.. ఈ ప్రత్యేక రోజున ఒక సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు సంతోషంగా ఎదురుచూస్తుంది. ప్రతిఫలంగా బహుమతులకు బదులు అతని ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తుంది. సోదరుడు కూడా అవే భావాలను పంచుకుంటూ జీవితంలో ఆమెకు ఏ హాని జరగకుండా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. కానీ ఇలాంటి బంధమే అక్కాచెల్లెళ్ల మధ్య ఉంటే.. ఒకరి సంరక్షణకు మరొకరు అనునిత్యం తపిస్తే.. రాఖీ ద్వారా తమ ఆరాధనను ఎందుకు వ్యక్తపరచకూడదనేది ఈతరం అమ్మాయిల ఒపీనియన్. నిజమే.. మనందరం రక్షా బంధన్ విషయంలో సంకుచిత అర్థానికి లొంగిపోయాం కానీ ఇద్దరు సోదరీమణుల మధ్య బలమైన ప్రేమ భావనను 'రాఖీ' ప్రతిబింబించలేదా? అంటే ఇదే టాపిక్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్న యంగ్ రైటర్ పుర్వి కల్రా.. ఈ రాఖీ పర్వదినాన స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తానంటోంది.
'రాఖీ పండగ అనేది ఏ ఇద్దరు తోబుట్టువులకైనా జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, రక్షించుకోవడానికి హామీ ఇస్తుందని గతేడాదే గ్రహించాను. జీవితంలోని ప్రతీ అడుగులో నా వెనకున్న సపోర్ట్ సిస్టమ్ నా చెల్లెలు. నాకంటే వయసులో చిన్నదైనా.. తన వివేకవంతమైన మాటలతో లైఫ్‌లో పాజిటివిటీ ప్రసరింపజేస్తుంది. నేను నా గోల్ రీచ్ అయ్యేందుకు, బలహీనతల నుంచి బయటపడేందుకు ఆమె బలం సరిపోతుందని నాకు తెలుసు' అని చెల్లెలితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంది పుర్వి.
బ్రేకింగ్ స్టీరియోటైప్స్ :
ఈ రక్షా బంధన్ చెల్లెలితో తనకున్న వెలకట్టలేని అనుబంధానికి సంబంధించినదని పేర్కొన్న పుర్వి.. కొనుగోలు చేసే రాఖీ బ్యాండ్‌కు మన మణికట్టు మీద నిజమైన స్థానం ఉందని తెలిపింది. తామిద్దరూ ఒకరినొకరు బేషరతుగా ప్రేమిస్తున్నామని, జీవితాంతం అలానే కొనసాగుతామని చెప్పింది. అంతేకాదు తనలో కొంత భాగాన్ని చెల్లిలో చూసుకుంటానని, అలాగే చెల్లి కూడా ఆమెలో కొంతభాగాన్ని తనలో చూసుకుంటుందని.. అది జీవితాంతం ప్రయాణించడానికి సరిపోతుందని చెప్పుకొచ్చింది. కాగా తమ బంధాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ పండుగ తమకొక అవకాశం ఇచ్చిందని వెల్లడించింది. కాబట్టి సోదరులకు సోదరీమణులు కట్టే ఈ రక్షణ దారాన్ని(రాఖీ).. నిజంగా ఎవరైతే ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో మనకు కవచంగా నిలుస్తారో వారికే కట్టి రక్షాబంధన్ విషయంలో మూస పద్ధతులను విచ్ఛిన్నం చేద్దామని పిలుపునిచ్చింది.