- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కపుల్ కాదు.. ట్రిపుల్ : ఒక్కడినే పంచుకున్న ఇద్దరు యువతులు
దిశ, ఫీచర్స్ : సనాతన ధర్మం, ఆచార సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా భావించబడే భారత్‌లో 'ఏకభార్యత్వ' విధానమే విస్తృతంగా ఆమోదించబడింది. కానీ ఆధునిక భారతం ఇలాంటి కట్టుబాట్లకు చరమగీతం పాడుతోంది. ఇప్పుడు 'లెస్బియన్, గే' మ్యారేజెస్‌తో పాటు ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో కూడిన లివింగ్ రిలేషన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. రీసెంట్‌గా ముంబైకి చెందిన ఆశిష్ మెహ్రోత్రా, శ్వేతా సంగతానీ.. తనీషా RKతో బహుభార్యత్వ సంబంధాన్ని కొనసాగిస్తూ సామాజిక పారామితులను విచ్ఛిన్నం చేస్తున్నారు.
అంతకుముందున్న బంధం నుంచి 2017లో బయటపడిన తనీషా.. పాండమిక్‌కు కొన్ని నెలల ముందే ఆశిష్, శ్వేతలను కలుసుకుంది. కొద్ది పరిచయంలోనే తనీషా, ఆశిష్ డేటింగ్ ప్రారంభించారు. ఇక తన వివాహం గురించి ఓపెన్‌గా చెప్పేసిన ఆశిష్.. శ్వేతతో సహజీవనం చేయగలిగిన ఎవరితోనైనా డేటింగ్ చేస్తానని చెప్పేశాడు. ఇదే క్రమంలో తనీషా, శ్వేత కలిసి తిరగడం మొదలుపెట్టాక ఈ ముగ్గురూ కలిసే ఉండాలనుకుంటున్నారనే విషయం అర్థమైంది.
ఇక తమ రిలేషన్‌షిప్ గురించి స్పందించిన ఆశిష్.. తమది ప్రామాణిక ఏకస్వామ్య కుటుంబం కానప్పుడు ఇంత వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని తెలిపాడు. 'భిన్న లింగ వివాహాల్లో పితృస్వామ్య భావన బలంగా పాతుకుపోయింది. ఆయా సంబంధాలు, కుటుంబాల గురించి అందరికీ వెంటనే అర్థమవుతుంది. కానీ ఈ బంధం విషయంలో మా ముగ్గురినీ ఒకరికొకరు బంధువులుగా గుర్తించే అధికారిక పత్రం లేదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మేము ఒకరికొకరు సమానంగా నిర్ణయాలు తీసుకోలేం. రెంటల్ అగ్రిమెంట్స్‌పై కూడా ఒకటి లేదా రెండు పేర్లే కనిపిస్తాయి' అని చెప్పుకొచ్చాడు.
'ఇల్లు అంటే భర్త లేదా భార్య నా కోసం ఎదురుచూసే ప్రదేశం కాదు. ప్రేమ సంతోషాలతో నేను, నా ప్రాణ స్నేహితులు కలిసి నిర్మించుకున్నది. అధికారిక గుర్తింపు ఉన్నా లేకపోయినా ఇక్కడ నేను వారితో గర్వంగా, గౌరవంగా కడవరకు జీవిస్తాను' అని తనీషా చెప్పారు. కాగా ఇది కేవలం కొత్త కనెక్షన్స్‌ను అన్వేషించడమేనని శ్వేత చెప్పింది. ఇక ఈ ముగ్గురరు 'సంగ్యా ప్రాజెక్ట్' పేరుతో బిజినెస్ చేస్తున్నారు. ఇది జెండర్ ఫ్లూడిటీ, లైంగిక, మానసిక ఆరోగ్యం గురించిన ప్రసంగాలను కూడా అందిస్తుంది.
Also Read: ప్రపంచాన్ని ఆకర్షించిన 'చుకుడు'.. బతుకుల్ని బెటర్ చేసిన బండి! (వీడియో)