పాలు అతిగా తీసుకునేవారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..

by Prasanna |
పాలు అతిగా తీసుకునేవారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది పాలను ఇష్టంగా తాగుతారు. ఇది ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం. రోజుకు ఒకటి నుంచి రెండు గ్లాసుల పాలు తాగడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఒక గ్లాసు పాలలో .. ఒక పూట భోజనం తిన్నంత త పోషకాలు ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలలో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. పాలు తాగితే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. విటమిన్ ఎ, కాల్షియం పాలలో పెద్ద పరిమాణంలో ఉంటాయి. కాల్షియం మీ ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా, గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

పాలు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా, మెరుస్తూ ఉంటుంది. పాలలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండటం వల్ల అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా పాలలో ఉండే లాక్టోస్ కాలేయంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుంది.

పాలు వలన ఎన్నిలాభాలు ఉన్నాయో అదే విధంగా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.జలుబు, దగ్గు, విరేచనాలు, చర్మవ్యాధులు వంటి వ్యాధులతో బాధపడేవారు ఎప్పుడూ పాలు తాగకూడదు. పాలు అలెర్జీ ఉన్న వారు అసలు తీసుకోకూడదు. సాధారణంగా, ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజూ 2 కప్పులు పాలు త్రాగాలి. పిల్లలు ఒక కప్పు పాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed