ఆ ప్రదేశానికి వెళ్లిన వారు... ఇక పైకే అంట!

by Anjali |   ( Updated:2023-03-27 14:01:48.0  )
ఆ ప్రదేశానికి వెళ్లిన వారు... ఇక పైకే అంట!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ విశాలమైన ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతూ ఉండడం సహజం. దూరం నుంచి చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద కొండలు లాంటి కొన్ని ప్రదేశాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.. కానీ దగ్గరికి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది కదా అందులోని లోటుపాట్లేమిటో. అలాగే స్నేహితులు కానీ, ఇరుగుపొరుగు వారు కానీ కొన్ని అందమైన ప్రదేశాల గురించి చెబుతుంటే వింటాం. కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగాను, మరికొన్ని ప్రదేశాల చరిత్ర చాలా భయంకరంగానూ ఉంటుంది. అలాంటి భయంకరమైన ప్రదేశం ఏంటో తెలుసుకుందామా మరీ!

నిషేధ ప్రాంతమైన ‘వెనీషియన్ గల్ఫ్’ ఇటలీలోని వెనిస్, లిడో నగరాల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అంటారు. మరి ఎక్కడికి పోతారంటారా? పైకే మరి. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లోకి వెళ్లి ప్రాణలతో వచ్చిన వారూ ఒక్కరు కూడా లేరని చెబుతూ ఉంటారు. దీంతో ఆ నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఆ ప్రాంతాన్ని చాలా మంది శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు. సుమారు 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపం చుట్టురా ఎత్తైన గోడలు ఉంటాయి. ఈ ద్వీపం ఎందుకలా మారిందంటే..ఇటలీలో ప్లేగు మహమ్మారి వ్యాపించినపుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకొని వెళ్లి వదిలేసిందట. ఇలా చేయడం వల్ల వ్యాధి పెద్దగా వ్యాపించదని భావించిన ప్రభుత్వం అలాంటి దారుణానికి ఒడిగట్టింది. దాంతో ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా ద్వీపంలోనే వారిని ఖననం చేస్తారు. అందుకే ఈ ద్వీపంలోనే సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమై ఉండడం వల్ల ఆ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రావడం కష్టమని చెబుతారు.

Also Read...

గర్భస్రావాలకు ముఖ్య కారణమిదే.. గుర్తిస్తే జాగ్రత్తపడొచ్చు..

Advertisement

Next Story

Most Viewed