- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AI టీచర్లతో ఫస్ట్ స్కూల్.. ఏడాదికి ఎంత ఫీజో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవచ్చు...
దిశ, ఫీచర్స్ : లండన్‌లోని డేవిడ్ గేమ్ కాలేజ్, ఇండిపెండెంట్ బోర్డింగ్ స్కూల్ UKలో మొదటి టీచర్‌లెస్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించనుంది, ఇక్కడ 20 మంది GCSE విద్యార్థులకు గురువుగా మార్గనిర్దేశం చేసేందుకు కృత్రిమ మేధస్సు (AI) వినియోగించనున్నారు. మానవ ఉపాధ్యాయులకు బదులుగా, AI ప్లాట్‌ఫామ్స్ వ్యక్తిగతీకరించిన పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తాయి. ప్రతి విద్యార్థి బలాలు, బలహీనతల ఆధారంగా ఎలా క్లాస్ తీసుకోవాలో నిర్ణయిస్తుంది. ఇందులో వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లు కూడా ఉపయోగించబడతాయి. అయితే ఆర్ట్స్, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి కొన్ని సబ్జెక్టులకు మాత్రం మానవ గురువులు కంటిన్యూ అవుతున్నారు. AI ప్రాథమికంగా విద్యార్థులను అబ్జర్వ్ చేస్తుంది. తదనుగుణంగా వారి అభ్యాస మార్గాలను సర్దుబాటు చేస్తుంది.
మానవ ఉపాధ్యాయుల కంటే AI మరింత ఖచ్చితమైన లెర్నింగ్ పాత్స్ అందించగలదని నమ్ముతున్నట్లు తెలిపింది యాజమాన్యం. విద్యార్థి కష్టపడటానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించగలదని... సంప్రదాయ ఉపాధ్యాయుని కంటే కూడా పర్ఫెక్ట్ గా స్టూడెంట్ లోపాలను మరింత ఖచ్చితంగా గుర్తించగలదని చెప్తున్నారు. తద్వారా ఈ సాంకేతికత విద్యార్థులను వేగంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఏడాది ఫీజు దాదాపు రూ. 30 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ పురోగతికి వ్యతిరేకంగా మాట్లాడినవారు కూడా లేకపోలేదు. విద్యలో AI అభ్యాస ప్రక్రియను అమానవీయంగా మార్చగలదని, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అవసరమైన పరస్పర చర్యలను తొలగిస్తుందని వాదించారు. ఈ విధానం విద్య కోసం "ఆత్మ లేని" భవిష్యత్తుకు దారితీస్తుందని చెప్తున్నారు. ఖర్చు తగ్గించే చర్యగా వర్ణిస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ ను ఖండించింది యాజమాన్యం. ఈ సాహసోపేతమైన చర్య విద్యలో అనేక మార్పులు తీసుకురాగలదని అభిప్రాయపడింది.