బట్టలు విప్పేసి వేడుకలో పాల్గొన్న మహిళలు.. పురుషులతో కలిసి ఆ పని చేసేసరికి..!

by Javid Pasha |   ( Updated:2024-02-28 14:11:21.0  )
బట్టలు విప్పేసి వేడుకలో పాల్గొన్న మహిళలు.. పురుషులతో కలిసి ఆ పని చేసేసరికి..!
X

దిశ, ఫీచర్స్ : అదొక అందమైన ప్రదేశం. ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మానుష్యంగా కనిపించే ఆ ప్రదేశంలో నగ్నంగా ఉన్న కొందరు పురుషులు ‘వాషోయ్.. వాషోయ్’ అంటూ ముందుకు నడుస్తున్నారు. ఇంతలోనే కొందరు మహిళలు కూడా అక్కడికి చేరారు. అందరూ చూస్తుండగానే తమ ఒంటిపై ఉన్న బట్టలు విప్పేశారు. అక్కడున్న పురుషులను తోసుకుంటూ, కొందరు పురుషులపై నుంచి పాకుతూ వారికంటే వేగంగా ముందుకు వెళ్తున్నారు. కాసేపటి తర్వాత నగ్నంగా ఉన్న స్త్రీ, పురుషులు కలిసి కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. ఒకరినొకరు హత్తుకుని సంబురాల్లో పాల్గొంటున్నారు. జనాలు ఎగబడి చూస్తున్నారు. ఇంతకీ ఎందుకలా చేస్తున్నారు?, ఎక్కడ జరిగింది? అనుకుంటున్నారు కదూ.. జపాన్‌లోని ఒక ఆలయంలో జరిగిన న్యూడ్ ఫెస్టివల్ ఇది. ఎప్పటిలా కాకుండా ఈసారి జరిగిన ఈ పండుగలో మహిళలు కూడా నగ్నంగా పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రజంట్ సోషల్ మీడియాలో పలువురు దీనిగురించి చర్చించుకుంటున్నారు.

సెంట్రల్‌ జపాన్‌లోని కోనోమియా షింటో ఆలయంలో ప్రతి ఏటా సాంప్రదాయ బద్దంగా ‘హడాకా మత్సూరి’ లేదా న్యూడ్ ఫెస్టివల్ అనే పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ ప్రాంతంతోపాటు ఉత్తర జపాన్‌లోని కుకిసేకు ఆలయంలోనూ ఆ తర్వాత న్యూడ్ ఫెస్టివల్ జరుగుతుంది. దాదాపు 1250 సంవత్సరాలుగా ఈ మత్సూరి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు చెప్తారు. పండుగలు ఎక్కడైనా జరుపుకుంటారు. అందులో విశేషం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒంటిమీద నూలు పోగు లేకుండా కేవలం ఇన్నర్ లేదా గోచి మాత్రమే ధరించి దేవతను ఆరాదించడం ప్రత్యేకత.

తరతరాలుగా కొనసాగుతున్న హడాకా మత్సూరి వేడుకల్లో సాధారణంగా ప్రతి సంవత్సరం పురుషులు మాత్రమే పాల్గొనేవారు. కానీ ఈ వారం జరిగిన న్యూడ్ ఫెస్టివల్‌లో మహిళలు కూడా పాల్గొన్నారు. దుష్టశక్తులను పారదోలే దేవుడి ఆరాధనలో తాము ఎందుకు పాల్గొనకూడదనే చైతన్యంతో కొందరు స్త్రీలు వేసిన ఈ ముందడుగు ఎందరినో ఆకట్టుకుంది. అంతేకాదు, పండుగల్లో పురుషాధిక్యాన్ని ప్రశ్నించడంగానూ, ఎదిరించడంగానూ కొందరు పేర్కొంటున్నారు. అలాగని జపాన్‌లో మహిళలపట్ల వివక్ష తీవ్రంగా ఉందని కాదు, కానీ పురుషులతో సమానం అని చాటుకునే ఈ అవకాశాన్ని కూడా తాము వినియోగించుకున్నామని అట్సుకో తమకోషి అనే మహిళ అంటున్నారు. మొత్తానికి ఈ న్యూడ్ ఫెస్టివల్ ఇప్పుడొక హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed