నీలి రంగులో చేప మాంసం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

by Hamsa |   ( Updated:2023-03-03 10:18:39.0  )
నీలి రంగులో చేప మాంసం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: చేపలు సహజంగా గోధుమ, ఎరుపు, బూడిద రంగు మాంసాన్ని కలిగి ఉంటాయనేది మనకు తెలిసిందే. కానీ నీలిరంగు కండరాలను, మాంసాన్ని కలిగి ఉన్న చేపల గురించి మీరెప్పుడైనా విన్నారా? కానీ ఉత్తర అమెరికా పశ్చిమ తీరానికి చెందిన లింగ్‌కోడ్ అనే చేపల జాతిలో ప్రతీ ఐదింటిలో ఒకదానికి శరీరం లోపలి, వెలుపలి కండరాలు నియాన్ బ్లూ రంగును కలిగి ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే అలా ఎందుకుంటాయనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. నియాన్ బ్లూ ఫ్లెష్ ఫిషెస్ ఉంటాయనే అవగాహన, సమాచారం ఉన్నప్పటికీ వాటిపై విస్తతృత పరిశోధనలు జరగని కారణంగా లోతైన సమాచారం అందుబాటులో లేదు. కానీ నియాన్ బ్లూ కలర్ చేపల మాంసం మాత్రం సీ ఫుడ్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటుంది.

లింగ్‌కోడ్ (lingcod) జాతి చేపల మాంసం రుచికరంగా ఉంటుందని వాటిని ఇష్టంగా తినేవారు చెప్తుంటారు. అయితే ఈ చేపలో మరో ప్రత్యేకత ఏంటంటే.. 152 సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరిగే (bottom-dwelling fish) బాటమ్ డ్యుయలింగ్ మౌత్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇది ఒక విపరీతమైన (voracious) ప్రెడేటర్‌గా చెప్పవచ్చు. ఈ జాతి చేపలు వాటి పెద్దదైన నోటి ద్వారా కదులుతున్న చిన్న చేపలను, కీటకాలను తింటాయి. వాటి నోటి ఆకారానికి సరిగ్గా సరిపోయే (moves and fits into its large mouth ) ఆహారాన్ని ఎంచుకుంటాయి.

అయితే (only a couple of species of seals and human fishermen to worry about) ఈ జాతి చేపలలోని కపుల్స్ కొన్నింటిలో నోటి భాగంలో సీల్స్ కలిగి ఉండటం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశంగా మత్స్యకారులు పేర్కొంటారు. దాదాపు 20 శాతం చేపలు నియాన్ బ్లూ మాంసాన్ని కలిగి ఉండటంవల్ల లింగ్‌కోడ్‌ను ‘స్మర్ఫ్ కాడ్’ (smurf cod) అని కూడా పిలుస్తారు. ఎందుకలా నియాన్ బ్లూ ఫ్లెష్ కలిగి ఉంటుందనే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ లేదుగానీ న్యూక్లియర్ రేడియేషన్ ప్రభావమే ఇందుకు కారణమని చెప్తుంటారు. మరో విషయం ఏంటంటే.. సైంటిస్టులు ఈ విచిత్రమైన రంగు గురించిన అవగాహన కలిగి ఉన్నప్పుటికీ ఎందుకనే విషయాన్ని నిర్ధారించలేదు.

2016 స్పియర్ ఫిషింగ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు సముద్ర పర్యావరణ శాస్త్రవేత్త ఆరోన్ గాల్లోవే తన జీవితంలో మొదటి సారిగా బ్లూ లింగ్‌కోడ్‌ ఫిష్‌ను చూశాడు. దాని కండరాలు, శరీర భాగం లోపల, వెలుపల నియాన్ బ్లూ కలర్ ఉన్నట్లు అతను గమనించాడు. అయితే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఇందుకు సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదని అర్థమైంది. నియాన్ బ్లూ లింగ్‌కోడ్ అనే చేపల జాతి ఉంటుందని ఇంతకు ముందు గుర్తించినప్పటికీ దాని గురించి విస్తృతమైన పరిశోధనలు ఎవరూ చేయలేదు. కాబట్టి నియాన్ బ్లూ ఫ్లెష్ ఎందుకుంటుందనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.

ఆడ చేపల్లోనే బ్లూ కలర్ ఎక్కువ

డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు నియాన్ బ్లూ ఫ్లెష్ కలిగిన చేపల్లో ఆడ చేపలే అధికంగా ఉన్నాయి. చేపల లింగ నిర్ధారణ, మాంసం నీలిరంగులో ఎక్కువగా ఉండటానికి గల కారణాలపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. బ్లూ లింగ్ కాడ్‌లో 80 శాతం ఆడచేపలు, 20 శాతం మగచేపలు నియన్ బ్లూ ఫ్లెష్‌ను కలిగి ఉంటున్నాయి. ఈ నీలి రంగు చేపలకు ఆల్ట్రా వాయిలెట్ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు కొందరు నిపుణులు చెప్తున్నారు. అయితే కొందరు ఆహార వనరుల నుంచి ఈ కలర్ మాంసం వస్తుందని పేర్కొంటున్నారు. కాగా ఈ చేపల జాతిలో కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు ఉండటంవల్ల వాటి మాంసం నియాన్ బ్లూ కలర్లోకి వచ్చి ఉంటుందని పరిశోధకుడు గాల్లోవే చెప్తున్నాడు. కానీ కచ్చితమైన నిర్ధారణలు మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి : మార్చి నెలలో ఈ రాశి వారికి అద్భుత అదృష్ట యోగం.. మీ రాశి ఉందా?

Advertisement

Next Story

Most Viewed