90 ఏళ్ల తర్వాత వస్తోన్న రాఖీ ప్రత్యేక విశిష్టత ఇదే.. చాలా అరుదైన శుభయోగాలతో సోదరసోదరిమణుల బంధం?

by Anjali |   ( Updated:2024-08-14 09:07:43.0  )
90 ఏళ్ల తర్వాత వస్తోన్న రాఖీ ప్రత్యేక విశిష్టత ఇదే.. చాలా అరుదైన శుభయోగాలతో సోదరసోదరిమణుల బంధం?
X

దిశ, ఫీచర్స్: సోదర సోదరీమణులు ఎదురుచూసే రాఖీ పండుగ రానే వస్తోంది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లపై ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు 19 వ తారీకున వస్తుంది. ప్రియమైన సోదరులకు ఏడాదంతా మంచి జరగాలని,సుఖ సంతోషాలతో జీవించాలని కోరకుంటూ అక్కాచెల్లెళ్లు అన్నాదమ్ములకు రాఖీ కడుతారు. కొంతమంది తండ్రకులకు కూడా రాఖీ కడతారు. అనంతరం సోదరుడు తమ తమ అక్కాచెల్లెళ్లకు కానుకలు, బహుమతులు ఇస్తారు. ఇదంతా పక్కన పెడితే.. ఈ సంవత్సరం వచ్చే రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.

రాఖీ రోజున శక్తివంతమైన గ్రహ సంయోగం జరగబోతుందట. అయితే పంచాంగం ప్రకారం 90 ఏళ్ల అనంతరం రాఖీ రోజున నాలుగు శుభ యోగాలు కలగుతాయట. అవేంటంటే..? శ్రవణ నక్షత్రం, శోభ యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం కలిసి మహా సంయోగం జరగనున్నాయట. కాగా ఈసారి చాలా స్పెషల్ అని చెబుతున్నారు. అయితే నక్షత్రంతో గ్రహాలు కలవడం చాలా అరుదు. ఈ సమయంలో సోదరిమణులు తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల వారి బంధం మరింత బలపడనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Read More..

Raksha Bandhan: ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో రాఖీ కట్టకండి.. ఆ రోజు పాటించాల్సిన నియమాలు

Advertisement

Next Story

Most Viewed