- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమిపై మరణం లేని జీవి ఇదొక్కటే..! దానికదే సెక్స్..
దిశ, వెబ్‌డెస్క్: ఈ భూమిపై ఉన్న ప్రతీ జీవికి పుట్టుక, చావు సర్వసాధారణం. మనుషులైనా.. జంతువులైనా.. జీవ క్రిములైనా పుట్టాక మరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, మరణమే ఎరుగని జీవి ఉందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఈ షాకింగ్ విషయం గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
ఈ జీవి పేరు హైడ్రా. ఇది ప్రవహించే లేదా ప్రవాహం లేని నీటిలో, మురికి నీటిలో ఉంటుంది. అయితే వీటి వయసు ఎంత వరకు పెరగొచ్చు అనే విషయంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త డానియల్ మార్టినెజ్ షాకింగ్ విషయాలు తెలిపారు. హైడ్రా వయస్సు విషయంలో ఆయన డేటా రెండు సార్లు విఫలమైందంట. ఈ క్రమంలోనే ఆయన హైడ్రా ఆకృతిని గమనించాడు. అది గొట్టం రూపంలో ఉండి పొడుగ్గా ఉంటుంది. హైడ్రా రెండు పొరలను కలిగి ఉంటుంది. బయట పొరను ఎక్టోడెర్మ్, రెండోవ పొరను ఎండోడెర్మ్ అని పిలుస్తారు. హైడ్రా అసలు శరీరం మూలకణాలతో రూపొందించబడింది. తక్కువ కణాలు ఉన్నప్పటికీ.. ఇవి నిరంతరం కొత్త కణాలను తయారు చేస్తూనే ఉంటాయని పరిశోధనలో తేలింది. హైడ్రా ప్రత్యేక జీవి... వివిధ జీవులతో పోల్చితే దీని పెంపకం పద్ధతి భిన్నంగా ఉంటుంది.
హైడ్రా మగ లేదా ఆడ రూపంలో కనిపించవచ్చు. ఇది స్త్రీ రూపాన్ని స్వీకరించినప్పుడు ‘హెర్మాఫ్రొడైట్’ అని పిలుస్తారు. ద్విలింగంగా ఉండటం వల్ల, హైడ్రా స్త్రీ అవయవాలలో పునరుత్పత్తి చేస్తుంది. ఇందులో మగ సెక్స్ అవయవాలు (వృషణాలు), స్త్రీ లైంగిక అవయవాలు (అండాశయాలు) ఉంటాయి. హైడ్రా శరీర పొడవు ఒక సెంటీమీటర్ వరకు ఉంటుంది. అయితే.. ఇన్ని కనిపెట్టిన పరిశోధకులు దీని జీవిత కాలాన్ని మాత్రం కనుగొనలేకపోయారు.
Read More... మే-31: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం