వచ్చే పాతికేళ్లలో100 కోట్ల మందికి వచ్చే వ్యాధి ఇదేనంట!

by Jakkula Samataha |
వచ్చే పాతికేళ్లలో100 కోట్ల మందికి వచ్చే వ్యాధి ఇదేనంట!
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యానికి మించిన సంపదలేదు అంటారు. ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న జీవనశైలి, మనం తీసుకుంటున్న ఆహారం వలన త్వర త్వరగా అనారోగ్యం బారినపడుతున్నాం. ఇక ఇప్పటికే ఉన్న రోగాలు సరిపోక,కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చిన్న వ్యాధులు, అంటువ్యాధులు పోయి, కరోనా లాంటి డేంజరస్ వ్యాధులు పుట్టుకొచ్చాయి. దీంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కాగా, ఈ మధ్య పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వచ్చే పాతికేళ్లలో,2050 వరకు 100 కోట్ల మందికి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, రుమటాలజీ జర్నల్లో ప్రచురించారు. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 59 కోట్ల మంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2050 కల్లా , 100 కోట్లను దాటే అవకాశం ఉందని వారు తెలిపారు. ఆర్థరైటిస్‌ను వాడుక భాషలో జాయింట్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధిబారిన పడినవారిని కీళ్లు చాలా ఇబ్బంది పెడుతాయి. కాళ్ల వాపురావడం, నడవలేకపోవడం, ఏ పని చేయలేకపోతుంటారు. అయితే ఇది ఎక్కువగా ఎముక చివరి భాగమైన మృదులాస్థి అరిగిపోవడం వలన వస్తుంది. మృదులాస్థి సాధారణంగా 25-30 ఏళ్ల వరకు ఉంటుంది. అది కోల్పోయాక దాదాపు ప్రతి ఒక్కరికీ 60 ఏళ్ల వయస్సులో కీళ్లనొప్పులు వస్తుంటాయి.అలాటగే వృద్ధాప్యం ఈ వ్యాధికి ప్రధాన కారణం. పురుషుల కంటే మహిళలకు ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువ. ఎందుకంటే మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed