నైట్‌ టైంలో ఈ దుస్తులు అస్సలే ధరించకూడదంట!

by Jakkula Samataha |
నైట్‌ టైంలో ఈ దుస్తులు అస్సలే ధరించకూడదంట!
X

దిశ, ఫీచర్స్ : రోజు వారి లైఫ్ లో వ్యక్తుల అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయి.ఇక రాత్రి సమయంలో ప్రశాంతగా నిద్రించడానికి లైట్ వెట్ డ్రెస్ లు యూజ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి వర్క్ లో ఎంతో బిజీగా ఉన్న నైట్ ప్రశాంతమైన నిద్రను కోరుకుంటారు. అంతే కాదు చాలా మంది లో దుస్తులు వేసుకుంటారు. కానీ రాత్రి సమయంలో ఇన్నర్ వేర్ వల్ల సమస్యలు వస్తాయంటున్నారు.అంతే కాకుండా నైట్ టైం లో లోదుస్తులు లేకుండా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది కుర్చీలకే పరిమితమై చేసే ఉద్యోగాలలో బిజీ అవుతున్నారు. అటూ ఇటూ అలుపెరగకుండా తిరుగుతూ గడిపే జీవితాలు మరికొందరివి. ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి అయ్యేసరికి అలసి పోతున్నారు. ఉదయాన్నే చక్కగా శుభ్రంగా తయారై బయటకు వెళ్ళాక సాయంత్రం అయ్యేసరికి చికాకు. పొల్యూషన్, బయటకు వెళ్లి అలసి పోవడం ఇలా చాలా కారణాల వలన లోదుస్తులు వాడుతుంటారు.అంతే కాకుండా మనకి లోదుస్తులు వేసుకోవడం అనేది చిన్నతనం నుంచి తప్పనిసరిగా అలవాటు చేసేస్తారు మన తల్లిదండ్రులు. దీంతో లోదుస్తులు ధరించడం అందరికీ అలవాటు అయ్యింది. కానీ, లోదుస్తులు వేసుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే.. వాటిని ధరించకపోవడం వలన వచ్చే లాభమే ఎక్కువగా ఉంటుంది. పరిశోధకులు లోదుస్తులు వేసుకోకపోవడం వలన ఎటువంటి మంచి జరుగుతుందో పలు సందర్భాల్లో వివరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లోదస్తులు ధరించడం వలన యోనీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నదంట. అలాగే చర్మ పగుల్లు రావడం, దురద, చర్మసమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అలాగే లోదుస్తులు ధరించడం వలన మూత్ర నాళసమస్యలు కూడా వస్తాయంట. అందువలన వీలైనంత వరకు లోదుస్తులకు దూరం ఉండాలి అంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story

Most Viewed