స్త్రీలు గురువారం అస్సలే ఈ పనులు చేయకూడదంట.. చేస్తే ఎంత అరిష్టమో..

by samatah |   ( Updated:2023-03-09 04:21:54.0  )
స్త్రీలు గురువారం అస్సలే ఈ పనులు చేయకూడదంట.. చేస్తే ఎంత అరిష్టమో..
X

దిశ, వెబ్‌డెస్క్ : గురు వారం రోజు కొన్ని పనులు చేయడం అనేది మంచిది కాదు అంటారు. కొన్ని ముఖ్యమైన కార్యాలు లేదా, ఏదైనా పని తొలిసారి గనుక ప్రారంభిస్తున్నట్లైతే గురువారం రోజు వద్దూ అంటారు పెద్దలు. అయితే అసలు గురువారం రోజున ఈ పనులు ఎందుకు చేయకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

గురువారం అనేది మన జీవిత అనుభవాన్ని ప్రభావితం చేసే విష్ణువు ప్రతిమ అయిన గురు బృహస్పతికి అంకితం. మన హిందూ మతంలో ప్రతి రోజుకు ఓ సొంత ప్రాముఖ్యత ఉంటుంది. అందువలన కొన్ని నిర్దిష్ట రోజుల్లో చేయకూడని పనులు, చేయాల్సిన పనుల గురించి తెలియజేశారు. అందులో భాగంగా గుురువారం చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గురువారం స్త్రీలు తల స్నానం చేయకూడదని నమ్ముతారు. ఎందుకంటే గురువారం బృహస్పతి ప్రభువు దినంగా పరిగణించబడుతుంది. అతను భర్త ప్రతిబింబాన్ని కూడా ప్రతిబింబిస్తాడు. అందువలన గురువారం తల స్నానం చేయడం వలన పిల్లలకు, భర్తకు దురదృష్టం కలుగుతుందంట. అలాగే సంపద కోల్పోయే అవకాశం కూడా ఉందంటున్నారు. అలా గురువారం ఇంటి శుభ్రం చేయడం మంచిదికాదంట. అంతే కాకుండా ముఖ్యమై శుభకార్యాలు, లేదా తొలిసారిగా చేసుకునే మంచి కార్యక్రమాలు గురువారం చేయకూడాదంట అలా చేస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే అని నమ్ముతున్నారు పెద్దలు.


ఇవి కూడా చదవండి :

ఉదయం టీ, కాఫీలకు గుడ్ బై చెప్పి.. ఇలా చేయండి.

Advertisement

Next Story