డెలివరీ తర్వాత ఆఫీస్ కి వెళ్తున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే..

by Sumithra |
డెలివరీ తర్వాత ఆఫీస్ కి వెళ్తున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే..
X

దిశ, ఫీచర్స్ : తల్లి కావడం అనేది స్త్రీ జీవితంలో ఎంతో అందమైన అనుభూతి. అయితే ఉద్యోగం చేసే మహిళలు మెటర్నిటీ లీవ్ ల ముగిసిన తర్వాత మళ్లీ కార్యాలయానికి వెళ్లడం అంటే అది పెద్ద సవాలు వంటిది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు, ఆఫీసుతో పాటు చిన్న పిల్లాడిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. ఆఫీసుకు వెళ్లినా అక్కడ కూడా తన బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తమ పిల్లలకు పాలివ్వడం గురించి మహిళలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రసూతి సెలవు తర్వాత కార్యాలయానికి వెళ్లే మహిళల కోసం ఈ చిట్కాలు.

పిల్లల బాధ్యత..

ప్రసూతి సెలవుల అనంతరం మహిళలు ఆఫీస్ కి వెళ్ళిన తరువాత పిల్లలని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన వారి మనస్సులో ఉంటుంది. అయితే కార్యాలయంలో చేరే ముందు పిల్లల జాగ్రత్తల గురించి కుటుంబ సభ్యులతో చర్చించాలి. అలాగే పిల్లల కోసం కేర్ టేకర్ ని ఎంచుకుంటే వారు పిల్లలని జాగ్రత్తగా చూసుకోగలరో లేదో నిర్ధారించుకోవాలి.

సమతుల్యత అవసరం..

ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం, పని మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మహిళలు ఆఫీసుకు వెళ్లినప్పుడు వారి దృష్టి పని పై ఉండాలి. అలాగే ఇంటికి వచ్చినప్పుడు దృష్టి మొత్తం ఇంటి పని, పిల్లల సంరక్షణ పై ఉండాలి. ఇలా చేసుకోవాలంటే ఒక దినచర్యను సెట్ చేసుకోవాలి.

భాగస్వామిని సహాయం కోరాలి..

తల్లి అయిన తర్వాత ఆఫీస్, ఇంటి బాధ్యతలు నిర్వహించడం అంత సులువు కాదు. అలాంటప్పుడు మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి సహాయం తీసుకోవాలి. పిల్లలను కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి జాగ్రత్తగా చూసుకుంటే మహిళలు ఇంటి పనులను సులువుగా చేసుకోవచ్చు.

ఆఫీస్ వర్క్..

చిన్న పిల్లలని ఇంట్లోనో, డే కేర్‌లోనో వదిలేసి ఆఫీసుకు రావడం అంత సులువు కాదు. అలా చేసినప్పుడు తల్లుల దృష్టి అంతా పిల్లల పైనే ఉంటుంది. అయితే ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు తొందరపడకండి. ఎందుకంటే మీరు మీ పనిని సరిగ్గా చేయకపోతే, అది మీ ఆఫీస్ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అలాగే మీ ప్రమోషన్ల పై కూడా ప్రభావం చూపిస్తుంది.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి..

పిల్లలు, కుటుంబం, ఆఫీస్ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. అయితే ఈ బాధ్యతలన్నింటిని నిర్వర్తించాలంటే మహిళలు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం మర్చిపోకూడదు. ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లల సంరక్షణతో పాటు ఇతర బాధ్యతలన్నీ నిర్వర్తించగలుగుతారు. అలాగే మీరు మీ పిల్లలకు సరైన సమయం ఇవ్వలేకపోతున్నారనే అపరాధ భావన మీ మనస్సులోకి రానివ్వకండి. వారాంతపు రోజులలో మీ కుటుంబం, పిల్లలతో ఎక్కువగా సమయం గడిపేలా ప్లాన్ చేసుకోండి.

బ్రెస్ట్ పంప్..

బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నట్టయితే బ్రెస్ట్ పంపును ఉపయోగించవచ్చు. దాని సహాయంతో తల్లి పాలను ఒక సీసాలో ఉంచవచ్చు. బిడ్డకు ఆకలిగా ఉన్నప్పుడు ఆ పాలను పట్టవచ్చు.

Advertisement

Next Story