‘చెవి, ముక్కు, గొంతు’ సమస్యలు రాకుండా ఉండాలంటే విడివిడిగా పలు జాగ్రత్తలు పాటించాల్సిందే!

by Anjali |   ( Updated:2024-03-10 11:38:14.0  )
‘చెవి, ముక్కు, గొంతు’ సమస్యలు రాకుండా ఉండాలంటే విడివిడిగా పలు జాగ్రత్తలు పాటించాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: మిగతా అనారోగ్య సమస్యలతో పోలిస్తే ముక్కు, చెవి, గొంతు సమస్యలు ఎక్కువగా బాధను కలిగిస్తాయి. ఇవి తల భాగంలో ఉండటం కారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ భాగాలకు చికిత్స కూడా చాలా కష్టమే. కాగా చెవి, ముక్కు, గొంతు సమస్యల బారిన పడకుండా ఉండాలంటే విడివిడిగా పలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు. చెవి, ముక్కు, గొంతు సమస్యకు కారణాలు.. సమస్య తలెత్తకుండా ఉండే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

‘చెవి సమస్యకు కారణాలు’..

* సైనస్ ఇన్ఫెక్షన్

* గొంతు ఇన్ఫెక్షన్

* పంటి ఇన్ఫెక్షన్

* చెవిలో నీరు చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.

* దవడ ఆర్థరైటిస్

* టెంపో రోమాండిబ్యులర్ జాయింట్ సిండ్రోమ్

* చెవిలో నీరు చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.

*దవడ నొప్పి

* చెవిలో గులిమి ఏర్పడుతుంది.

‘చెవి ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సినవి’..

ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా చెవి సమస్యల్లో వినికిడి లోపం బారిన పడే వారి సంఖ్య ఎక్కువైంది. ఇందుకు కారణం.. చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఎక్కువగా పెట్టుకోవడం, బడ్స్ ను ఎక్కవగా వాడటం. ఈ కారణంగా చెవుల్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి కర్ణభేరి ఒత్తిడికి గురవుతుంది. కాగా ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించాలని, అలాగే కాటన్ బడ్స్ పెట్టి తిప్పడం లాంటివి చెయొద్దని నిపుణులు చెబుతున్నారు. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒకసారి హాట్ వాటర్ తో చెవులు క్లీన్ చేసుకోవాంటున్నారు. చెవి నొప్పిగా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలని నిపుణులు చెబుతున్నారు.

‘ముక్కు సమస్య’..

ముక్కు ఆరోగ్యం శ్వాస వ్యవస్థ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సైనస్ వంటి సమస్యలు అనగా.. దగ్గు, జలుబు వంటి ఈ కోవలోకి వస్తాయి. ఇవి రాకుండా ఉండేందుకు నిపుణులు చెప్పిన ఈ టిప్స్ పాటించండి.

‘ముక్కు ఆరోగ్యంగా ఉండాలంటే’..

ముక్కు కారడం, పట్టేయడం, పెయిన్ వంటివి సమస్యలు రాకుండా ఉండాలంటే మన శరీరంలో ఇమ్యూనిటీని సరిగ్గా చూసుకోవాలి. స్మోకింగ్, డ్రగ్స్ వంటివి నోస్ ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాగా కాలుష్యం, దుమ్ము, పొగ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటే సైనస్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉంటాయి.

గొంతు సమస్య..

దీర్ఘకాలిక రైనో సైనసైటిస్, పాలిప్స్, అలెర్జీ రినిటిస్, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, గాయం, కణితులు లేదా ఇతర నాడీ సంబంధిత రుగ్మతలు గొంతు సమస్యకు ఉదాహరణలు. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్లు అయిన ఫ్లూ, సాధారణ జలుబు, మీజిల్స్ కూడా గొంతు నొప్పికి దారితీస్తాయి. వీటి వల్ల జ్వరం, దగ్గు, ఫ్లూ వంటి ఇతర వ్యాధులు తలెత్తుతాయి.

గొంతు ఆరోగ్యంగా ఉండాలంటే...

గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. శరీరానికి రోగనిరోధక శక్తి ఎక్కువగా అవసరం. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, సింగర్లు వంటి వారు గొంతుకు తగినంత రెస్ట్ ఇవ్వాలి. వీరు వేడిగా ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed