- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hangover : రాత్రి హ్యాంగోవర్ అయిందా? ఈ ఫుడ్ తీసుకోండి ఈజీగా కంట్రోల్ అవొచ్చు..
దిశ, ఫీచర్స్ : వీకెండ్ పార్టీలతో హ్యాంగోవర్ అయిపోవడం సాధారణం. డ్రింక్ తీసుకునేటప్పుడు మజాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి బాధపెడుతుంటాయి. బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని పదార్థాలు హెల్ప్ చేస్తాయంటున్న నిపుణులు.. వాటి గురించి వివరిస్తున్నారు. ఎలా సహాయం చేస్తాయో చెప్తున్నారు.
అరటి పండు
బనానాలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసేందుకు సహాయపడుతుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
ఆరెంజ్
విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆరెంజ్ శరీరం నుంచి ఆల్కహాల్ ను బయటకు పంపేందుకు సహాయం చేస్తుంది. మళ్ళీ నార్మల్ అయ్యేందుకు ఎనర్జీని ఇస్తుంది.
నట్స్
మెగ్నీషియం, అమైనో యాసిడ్స్ అధికంగా ఉన్న నట్స్ .. ఇన్ స్టంట్ ఎనర్జీని నింపుతాయి. హ్యాంగోవర్ లక్షణాల నుంచి బయటపడేసి హెల్తీగా మారుస్తాయి.
తేనె
ఫ్రక్టోస్ కలిగిన తేనె హ్యాంగోవర్స్ ను తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. కాలేయంలో ఆల్కహాల్ కంటెంట్ ఆక్సీకరణను వేగవంతం చేస్తుంది.
అల్లం
అల్లం.. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా శరీరం నుంచి ఆల్కహాల్ ను బయటకు పంపిస్తుంది. హ్యాంగోవర్ తర్వాత
వచ్చే కడుపు నొప్పి, వికారం చికిత్సకు సహాయపడుతుంది.
గుడ్లు
ఎగ్స్.. యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఆల్కహాల్ ను బ్రేక్ చేసి... మెటబాలిజంను బూస్ట్ చేస్తాయి.