- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Slow Poison : మీరు రోజూ చేస్తున్న ఈ పనులు స్లో పాయిజన్‌లా పని చేస్తున్నాయి..జాగ్రత్త!!
దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ జనాలు బిజీ లైఫ్ గడిపేస్తున్నారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం పరుగెత్తుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మనం డైలీ చేసే కొన్ని పనులు మనపై స్లో పాయిజన్ లా వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళన, ఇష్టంలేని ఉద్యోగంతో సహా ఈ జాబితాలో మరిన్ని అలవాట్లు ఉండగా.. ఇవి మానసిక, శారీరక అనారోగ్యానికి కారణం అవుతున్నాయి.
ఒత్తిడితో కూడిన జీవితం
దీర్ఘకాలిక ఒత్తిడి ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్తుంటారు ఎక్స్ పర్ట్స్. క్రమంగా శరీరం, మనసుని నాశనం చేస్తుందని.. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థతో సహా అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుందని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి లేని లైఫ్ కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఇష్టం లేని ఉద్యోగం
ఇష్టంలేని ఉద్యోగం చేయడం అసౌకర్యం మాత్రమే కాదు అనారోగ్యానికి దారితీస్తున్న అతిపెద్ద ప్రమాదం. ఇలా అసంతృప్తితో జాబ్ చేస్తూ పోతే.. తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలతో సహా శారీరక బలహీనతను ఎదుర్కొంటారు. మానసికంగా అలసిపోతారు. మొత్తానికి ఇంట్రెస్ట్ లేని జాబ్ స్లో పాయిజన్ లా వర్క్ చేస్తుందని చెప్తున్నారు నిపుణులు.
విషపూరిత వ్యక్తులతో గడపడం
మనం వర్క్ చేసే కంపెనీ కూడా మన ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతుంది. ఇంట్లో కన్నా ఎక్కువ సమయం ఇక్కడి సహోద్యోగులతోనే గడుపుతాం. కాబట్టి కొలీగ్స్ మన విజయాలను తక్కువ చేసి చూపించడం, అనవసరమైన డ్రామాలు ప్లే చేయడం, మన ఓపిక, శక్తిని హరించేవారు ఉన్నట్లయితే మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం
ఈ బిజీ లైఫ్ లో ఉద్యోగానికి, పడుకోవడానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేందుకు ఇవ్వట్లేదు. సరైన ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆర్డర్ పెట్టుకుని ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఈ హ్యాబిట్ చాలా హానికరమని చెప్తున్నారు నిపుణులు. ఇలాంటి ఫడ్ లో ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, షుగర్ ఎక్కువగా ఉంటుందని.. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
భావోద్వేగాల అణిచివేత
భావోద్వేగాలను అణిచివేయడం సంఘర్షణను నివారించేందుకు ఒక మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుందని చెప్తున్నారు నిపుణులు. కాలక్రమేణా భావోద్వేగ ఒత్తిడి పెరిగిపోయి శారీరక అనారోగ్యంగా మారుతుంది. అందుకే ఎమోషన్స్ రిలీజ్ చేయడం.. ఎప్పటికప్పుడు వ్యక్తపరచడం ముఖ్యమని సూచిస్తున్నారు.
స్కిప్పింగ్ బ్రేక్ ఫాస్ట్
రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు అల్పాహారం తీసుకోవడం కచ్చితంగా అవసరమని ఇప్పటికే పలు అధ్యయనాలు వివరించాయి. టైం లేదని తినకపోవడం వల్ల.. మెటబాలిక్ సిండ్రోమ్, బరువు పెరగడం, అభిజ్ఞా సామర్థ్యాలు తగ్గడం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆందోళన
దీర్ఘకాలిక ఆందోళన ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. ఇది ఎలివేటెడ్ కార్టిసాల్ స్థాయిలకు దారితీస్తుంది. కాలక్రమేణా అధిక కార్టిసాల్.. అధిక బరువు, హై బీపీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు కారణం అవుతుంది.
సెల్ఫ్ కేర్ పై నిర్లక్ష్యం
సెల్ఫ్ కేర్ తీసుకోకపోవడం బర్న్ ఔట్ కు దారితీయవచ్చు. ఈ పరిస్థితి శారీరక, మానసిక అలసటకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం బర్న్ ఔట్ .. డిప్రెషన్, క్రానిక్ ఫెటీగ్, కార్డియోవ్యాస్కులర్ సమస్యలతో సహా అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.