- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే.. ఇది అందరి బాధ్యత
దిశ, ఫీచర్స్: చిల్డ్రన్స్ డే అంటే చాచా నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా చేసుకునే పండుగ మాత్రమే కాదు. నెహ్రూ కోరిక ప్రకారం పిల్లలకు వారి హక్కులు, విద్యా, సంక్షేమం అన్నీ అందేలా చేయాలి. పిల్లల హక్కులు వారికి అందించే బాధ్యత ప్రభుత్వంతో పాటుగా సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరిది. భారత రాజ్యాంగం పిల్లల కోసం అనేక ప్రాథమిక హక్కులను కల్పించింది. వాటిలో కొన్ని ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతీ ఒక్కరూ కూడా తెలుసుకొని, తమ పిల్లలకు వాటిపై అవగాహన కల్పించాలి.
భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కులు:
సమానత్వపు హక్కు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతీ బిడ్డా సమానమే. ధనిక, పేద అనే బేధభావాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి.
వివక్షత: పిల్లను జాతి, కులం, మతం, లింగం ఆధారంగా వివక్షతన చూపకూడదు. ఆర్టికల్ 15 ప్రకారం రంగు, రూపం ఆధారంగా పిల్లలపై వివక్షత చూపకూడదు. అందరినీ సమానంగా చూడాలి.
జీవించే హక్కు: ఈ దేశంలో పుట్టిన ప్రపతీ బిడ్డకు జీవించే హక్కు ఉంటుంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం, సమాజానిదేనని ఆర్టికల్ 21(ఏ) స్పష్టం చేసింది.
ఉచిత నిర్బంధ విద్యాహక్కు: ఆర్టికల్ 21(ఏ) ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతీ పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. పిల్లలికి ఇష్టం లేకపోయిన తప్పకుంగా వారిని స్కూల్లో చేర్పించి, విద్చయను అభ్యసించేలా చేయాలి.
రక్షణ చట్టం: ఆర్టికల్ 23(ఏ) ప్రకారం పిల్లలను అమ్మడం, కొనడం వారితో భిక్షాటన చేయించడం నేరం.
అభివృద్ధి హక్కు: ఆర్టికల్ 39 (ఎఫ్)ఈ దేశంలో పుట్టిన ప్రతీ బిడ్డకు ఆరోగ్యపరంగా రక్షణను కల్పించాలి. వారికి సరైన పోషకాహారం అందించి వారిని సంరక్షించుకోవాలి.
ఇలా బాలలను సంరక్షించే హక్కులు చాలా ఉన్నాయి. వాటన్నింటి తప్పనిసరిగా పిల్లలకు తెలియజేయాలి. సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఈ హక్కులను కాపాడుకోవాలి.