- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెన్షన్‌లో చెమటలు వస్తున్నాయా..? అయితే ఇది మీ కోసమే..!
దిశ, వెబ్‌డెస్క్ : ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఏదైనా వర్కవుట్స్ చేసినప్పుడు ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. వర్కవుట్ చేసినప్పుడు శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు శరీరంలో ఉండే ఉష్ణాన్ని చల్లబరిచేందుకు చెమటలు ఉత్పత్తి అవుతాయి. కానీ మనిషికి టెన్షన్, ఒత్తిడి, ఆత్రుత, భయం, ఆందోళన సమయంలో కూడా చెమటలు పడుతుంటాయి. మరి అలాంటి సమయంలో చెమటలు ఎందుకు ఉత్పత్తి అవుతాయి, దానికి గల శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసుకుందాం.
ఒక్కో మనిషి శరీరతత్వం ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి, మరికొందరికి అస్సలు చెమటలే పట్టకుండా వారి శరీరం చాలా డ్రైగా ఉంటుంది. అలాగే మనిషి ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. అప్పుడు శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేయడంతో అలాంటి సమయంలో చంకలు, ముఖంపై, మెడపై, అరచేతులు, పాదాలకు చెమటపడుతుంది.
టెన్షన్‌లో చెమట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
మనిషికి ఏ కారణాల వల్ల చెమట వస్తుందో తెలుసుకుని ఆ ట్రిగ్గర్స్ ను నివారించేందుకు ప్రయత్నించాలి. అలసటకు గల కారణాలను తెలుసుకోవాలి. ఆల్కహాల్, కెఫిన్ ఎక్కువగా సేవించడం కారణంగా చెమటలు ఎక్కువగా వస్తాయి. వాటిని అదుపు చేయాలి. టెన్షన్‌గా ఉన్నప్పుడు లోతుగా శ్వాస తీసుకొని రిలాక్స్ అవ్వాలి. యోగా సాధన ఎక్కువగా చేయడం ద్వారా టెన్షన్‌ను తొలగించుకోవచ్చు.
Read more: మానసికంగా కృంగిపోతున్నారా.. అయితే ఇలా చేయండి