మగవాళ్లలో ఆడవాళ్లకు నచ్చని గుణాలు ఇవే.. అలా చూస్తే రచ్చరచ్చే..!

by Dishaweb |   ( Updated:2023-06-16 14:46:53.0  )
మగవాళ్లలో ఆడవాళ్లకు నచ్చని గుణాలు ఇవే.. అలా చూస్తే రచ్చరచ్చే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దాంపత్యం అంటే భార్యాభర్తల అన్యోన్యత. ఇది ఒక శాశ్వత బంధం. దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. దంపతుల అభిరుచులు, అభిప్రాయాలు, ప్రేమానురాగాలను పంచుకుంటూ, పెంచుకుంటూ అన్నింటా కుటుంబంలో ఒదిగిపోవాలి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల దంపతుల మధ్య అనురాగం కరువైతున్నది. ఒకరికి నచ్చని పనులు మరొకరు చేయటం ఇందుకు ప్రధాన కారణం. ఇందులో ఎక్కువగా మగ వారే ఆడవారికి నచ్చని పనులు చేస్తున్నారంట.

భార్యభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా వారి మధ్య గొడవలు కామన్. మగవారు చేసే కొన్ని పనులు ఆడవాళ్లకు అస్సలు నచ్చవు. అందుకే తరచూ దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి. మగవాళ్లు తమ ఫ్రెండ్స్‌తో జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకోవడం ఆడవారికి అస్సలు నచ్చదు. అలాగే భర్తకు ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నా ఒప్పుకోరు. అలాగే కొందరు భార్యలు తమ భర్తలు అందరి ముందు ప్రేమ చూపాలని కోరుకుంటారు. వాళ్లు ఎక్స్ పెక్ట్ చేసింది జరగకపోయినా కోపగించుకుంటారు. అలాగే నలుగురిలో ఆడవారిపై నిందలు వేసినా, కామెంట్లు చేసినా నచ్చదని నిపుణులు చెబుతున్నారు.

Also Read..

పక్కింటి వారి భార్యను దొంగిలిస్తేనే అక్కడి యువకులకు పెళ్లి..

Advertisement

Next Story