నెలలు నిండకుండా పుట్టే పిల్లలను వేధించే దీర్ఘకాలిక సమస్యలు ఇవే!

by Jakkula Samataha |
నెలలు నిండకుండా పుట్టే పిల్లలను వేధించే దీర్ఘకాలిక సమస్యలు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : అమ్మతనం గొప్ప వరం. బిడ్డ పుట్టి భూమి మీదకు వచ్చిదంటే ఆ సంతోషం చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక పుట్టినప్పటి నుంచి శిశువు చాలా బాగా చూసుకోవాలి. అయితే కొంత మంది నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిస్తారు. అలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా ఉండాలి అంటారు వైద్యులు. సాధరణంగా ఆరోగ్యకరమైన గర్భం 40 వారాల వరకు ఉంటుంది. కానీ 37 వారాలకంటే ముందుగా డెలివరీ అయితే దానిని ప్రీటర్మ్ బర్త్ అంటారు. ఇంకొంత మంది 24,28 వారాలకే బిడ్డకు జన్మనిస్తారు. అయితే ఇలా నెలలు నిండకుండా పుట్టిన వారిలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.

ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల గుండె, ఊపిరితిత్తుల, మెదడు లాంటి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. దీంతో వీరికి అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. కాగా, నెలలు నిండకుండా పుట్టే పిల్లలు ఎదుర్కొనే దీర్ఘకాలిక సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఊపిరితిత్తుల సమస్యలు

నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన వీరు కొద్ది రోజులు వెంటలేటర్‌పై కూడా ఉండాల్సి వస్తుంది.అంతే కాకుండా వీరికి రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది.


కంటి సమస్యలు

నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో రెటీనాలోని రక్తనాళాలను ప్రభావితం చేసే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే పరిస్థితికి దారి తీస్తుంది. సరిగ్గా చికిత్స చేయకపోతే ఇది తాత్కాలికంగా లేదా పూర్తిగా దృష్టిని కోల్పోయేలా చేస్తుంది.

గుండె సమస్యలు

నెలలు నిండకుండా పుట్టే వారిలో గుండెకు హోల్స్ ఉండటం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన వారు ఫ్యూచర్‌లో చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

మెదడు సమస్యలు

నెలలు నిండకుండా జన్మించిన పిల్లలు సెరిబ్రల్ పాల్సీని అభివృద్ధి చేయవచ్చు. దీని వలన శరీర అభివృద్ధిలో ఇబ్బందులు, మొదడు అపరిపక్వత లాంటి సమస్యలు ఏర్పడుతాయి

Advertisement

Next Story

Most Viewed